Ola S1 Pro Sona Edition:ఇండియాలో లీడింగ్ టూ-వీలర్ ఈవీ తయారీ సంస్థ ఓలా తన 'ఎస్1 ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను 'సోనా' పేరుతో తీసుకొచ్చింది. పేరుకు తగినట్లుగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని చాలా వరకు ఎలిమెంట్స్ 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్‌తో తయారు చేశారు.
ఈ సరికొత్త 'ఓలా S1 ప్రో సోనా' ఎన్ని లిమిటెడ్ యూనిట్లు అందుబాటులో ఉంటాయనే దానిపై కంపెనీ ఇంకా సమాచారం అందించలేదు. అయితే ఓలా ఈ కొత్త సోనా ఎడిషన్ కోసం కాంపిటీషన్‌ను నిర్వహిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. తన సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ న్యూ మార్కెటింగ్ క్యాంపైన్‌ను రన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ సోనా ఎలక్ట్రిక్‌ను లాంఛ్ చేసి పోటీ నిర్వహిస్తోంది.
ఫీచర్లు:ఈ ఓలా S1 ప్రో సోనా స్కూటర్‌ను ప్రత్యేకమైన కలర్లో తీసుకొచ్చారు. దీన్ని పెర్ల్ వైట్, గోల్డ్ మిక్స్డ్ కలర్లో స్టన్నింగ్ లుక్‌లో డిజైన్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. రియర్ ఫుట్‌పెగ్, గ్రాబ్ రైల్, బ్రేక్ లివర్, మిర్రర్ స్టాక్ వంటి అనేక యూనిట్లను 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. ఈ స్కూటర్సీటును డార్క్ బ్రైట్ నప్పా లెదర్‌లో జరీ థ్రెడ్ ఉపయోగించి గోల్డ్ థ్రెడ్‌తో స్టిచ్చింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ సీటు ప్రీమియం లుక్‌లో కన్పిస్తుంది.
అంతేకాక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్లో మరింత పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఈ మోడల్లో గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్‌బోర్డ్ వంటివి ఉన్నాయి. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ చేసుకునేందుకు మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఉన్నాయి.
స్కూటర్ సొంతం చేసుకోండిలా!:ఓలా తన సేల్స్ పెంచుకునేందుకు క్యాంపైన్లో భాగంగా ఈ స్కూటర్‌పై కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే వారు 'Ola S1 ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఇన్‌స్టా రీల్ పోస్ట్ చేయాలి. లేదాఓలాస్టోర్ వెలుపల ఫొటో లేదా సెల్ఫీని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫొటోలు లేదా వీడియోలను #OlaSonaContest అనే హ్యాష్‌ట్యాగ్‌తో 'Ola Electric'కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయాలి. ఇలా లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని గెలుచుకునే అవకాశం పొందొచ్చు. ఈ పోటీ ఓలా స్టోర్స్ వద్ద డిసెంబర్ 25 అంటే ఇవాళే జరగనుంది.