ETV Bharat / technology

వారెవ్వా డుకాటి నయా బైక్ డిమాండ్ చూశారా?- 24గంటల్లోనే ఫస్ట్ స్లాట్​ బుకింగ్స్ కంప్లీట్! - 2025 DUCATI PANIGALE V4

త్వరలో మార్కెట్​లోకి '2025 పనిగలే V4' మోటార్​సైకిల్!- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

2025 Ducati Panigale V4
2025 Ducati Panigale V4 (Photo Credit- Ducati)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 29, 2025, 4:35 PM IST

2025 Ducati Panigale V4: ప్రీమియం అండ్ స్పోర్టీ మోటార్​సైకిల్ తయారీ సంస్థ డుకాటి ఇండియా మంగళవారం తన '2025 పనిగలే V4' మోడల్ బుకింగ్స్​ను ప్రారంభించింది. కంపెనీ స్టార్ట్​ చేసిన కేవలం 24 గంట్లోనే ఈ మోటార్​సైకిల్​ ఫస్ట్ లాట్ పూర్తిగా బుక్​ అయింది. ఈ మోటార్​ సైకిల్​ త్వరలోనే మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ గత కొన్ని రోజులుగా దీని టీజర్​లను సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లోని తన ఖాతాలలో విడుదల చేస్తోంది.

ఈ 2025 డుకాటి పనిగలే V4 మోడల్ కంపెనీ నుంచి వచ్చిన సెవెన్త్-జనరేషన్ హై-పెర్ఫార్మెన్స్ సూపర్​బైక్​. దీన్ని మొదటిసారిగా 2024 వరల్డ్ డుకాటి వీక్‌లో ప్రవేశపెట్టారు. దీనిలో సరికొత్త డిజైన్, సవరించిన ఛాసిస్, లార్జ్ ఎక్విప్మెంట్ లిస్ట్, అప్​డేట్​డ్ ఇంజిన్ వంటివి ఉన్నాయి.

​2025 డుకాటి పనిగలే V4 డిజైన్: ఈ కొత్త 'పానిగేల్ V4​' మోటార్​సైకిల్ ఫ్రంట్-ఎండ్ డిజైన్​ను 'డుకాటి 916', 'డెస్మోసెడిసి GP' బైక్‌ల నుంచి తీసుకున్నారు. అయితే ఈ బైక్​లో అగ్రెసివ్ లుక్​లో హెడ్‌ల్యాంప్స్ ఉండవు. కానీ వీటికి బదులుగా ఇందులో సొగసైన LED హెడ్‌లైట్స్, కొత్తగా డిజైన్​ చేసిన ఇంటిగ్రేటెడ్ వింగ్​లెట్స్​ ఉంటాయి.

ఈ మోటార్ సైకిల్ ఏరోడైనమిక్స్​ను డుకాటి కోర్స్ ఇంజనీర్ల సహకారంతో అభివృద్ధి చేశారు. కంపెనీ దీని ఫ్యూయెల్ ట్యాంక్, సీట్, ఫుట్‌పెగ్స్, కాంటాక్ట్ పాయింట్లలో మార్పులతో రైడర్ ఎర్గోనామిక్స్‌ను కూడా మెరుగుపరిచినట్లు పేర్కొంది.

2025 డుకాటి పనిగలే V4 ఎలక్ట్రానిక్స్: కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్‌లో ఎలక్ట్రానిక్ ఎయిడ్స్‌కు సంబంధించిన అన్ని ఫీచర్లను అందించింది. వీటితోపాటు ఈ కొత్త బైక్​లో రేస్ eCBS అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్​తో ఫ్రంట్ బ్రేక్ ఉపయోగించినప్పుడు వెనక బ్రేక్ కూడా అప్లై అవుతుంది. ఈ సిస్టమ్ మనకు అవసరమైనప్పుడు లీన్ యాంగిల్ అండ్ థొరెటల్ ఇన్‌పుట్ వంటి డేటాను ప్రభావితం చేస్తుంది.

ఇక ఈ మోటార్ సైకిల్ కొత్త 6.9-అంగుళాల TFT డిస్​ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, TPMS, రైడింగ్ అండ్ పవర్ మోడ్స్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, ABSతో పాటు అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది.

2025 డుకాటి పనిగలే V4 పవర్‌ట్రెయిన్: ఈ కొత్త బైక్​ అప్​డేటెడ్ 1,103cc, డెస్మోసెడిసి స్ట్రాడేల్ V4 ఇంజిన్​తో వస్తుంది. ఇది ఇప్పుడు యూరో5+ కంప్లైంట్‌గా ఉంది. ఈ ఇంజిన్ 13,500rpm వద్ద 216bhp శక్తిని, 11,250rpm వద్ద 120.9Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌లో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. దీని కారణంగా ఈ మోటార్​సైకిల్ బరువు 1kg తగ్గింది.

2025 డుకాటి పనిగలే V4 ధర: ప్రస్తుత పనిగలే V4 బేస్ మోడల్ ధర రూ. 27.72 లక్షలు. ఇక దీని S వేరియంట్ ధర రూ. 33.48 లక్షలు. అటువంటి పరిస్థితిలో ఈ కొత్త 2025 మోడల్ ధరలు వీటి కంటే ఎక్కువగానే ఉండొచ్చు.

మార్కెట్​లో దీని ప్రత్యర్థులు: ఈ కొత్త '2025 డుకాటి పనిగలే V4' భారత మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన 'BMW S 1000 RR'తో నేరుగా పోటీ పడబోతోంది.

ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్- టీజర్ చూస్తే అవాక్కైపోతారంతే!

సూపర్ ఫీచర్లతో ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200 సిరీస్!- ఈ ప్రీమియం బైక్స్​ రేటెంతో తెలుసా?

UPI యూజర్లు జాగ్రత్త!- ఈ ఆప్షన్​ను వెంటనే ఆఫ్ చేయండి- లేకుంటే మీ ఖాతా ఖాళీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.