Nothing Phone 3a Series Teaser:లండన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ప్రస్తుతం దాని తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'నథింగ్ ఫోన్ 3a'పై పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో దీని ప్రారంభానికి ముందుగా కంపెనీ ఈ ఫోన్ టీజర్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రిలీజ్ చేసింది. అందులో ఉన్న సమాచారం ప్రకారం నథింగ్ ఈ ఫోన్‌ను మార్చి 4న లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక నథింగ్ కంపెనీ విడుదల చేసిన ఈ టీజర్‌లో 'Phone (3a) Series' అని రాసుకొచ్చింది. అంటే దీన్ని బట్టి కంపెనీ మార్చి 4న కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే లాంఛ్ చేయదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో 'నథింగ్ ఫోన్ 3a', 'ఫోన్ 3a ప్లస్' అనే రెండు మోడల్స్ రానున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రస్తుతం దీనిపై పెద్దగా సమాచారం రివీల్ కాలేదు. కానీ దీనిపై వచ్చిన లీక్స్ ప్రకారం ఈ ఫోన్ దాని ప్రీవియస్ వెర్షన్ కంటే కొన్ని సిగ్నిఫికెంట్ అప్‌గ్రేడ్స్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో లీక్స్ ఆధారంగా దీనిపై ఇప్పటి వరకు ఉన్న సమాచారం మీకోసం.
ఈసారి 'నథింగ్ ఫోన్ 3a' బిగ్ డిస్ప్లేకనిపిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్లో కొత్త క్వాల్కామ్ ప్రాసెసర్‌ను ఉపయోగించొచ్చు. ఇది 'నథింగ్ ఫోన్ 2a'లో ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌కి భిన్నంగా ఉంటుంది. ఇది మాత్రమే కాక ఈ ఫోన్ కెమెరాను కూడా అప్‌గ్రేడ్ చేసి తీసుకుని రావచ్చు.
నథింగ్ ఫోన్ 3a అంచనా స్పెసిఫికేషన్లు: ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు ఏ నథింగ్ ఫోన్‌లోనూ కంపెనీ ఇంత పెద్ద డిస్‌ప్లేను అందించలేదు. వీటితోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌ను అందించొచ్చు. ఇక ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.1తో వస్తుందని టెక్ నిపుణుల అంచనా.