Nothing Phone 3 Expected Launch Timeline: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ తన అప్‌కమింగ్ నథింగ్ ఫోన్ (3) లాంఛ్‌తో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రేసులో చేరనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరపై అనేక లీక్స్ వచ్చాయి. కంపెనీ కో-ఫౌండర్ కార్ల్ పీ ఈ సమాచారాన్ని నథింగ్ ఉద్యోగులకు పంపినట్లు ప్రచారం అవుతున్న లీక్ అయిన ఇమెయిల్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ టైమ్‌లైన్‌ను వెల్లడిస్తుంది.
టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ఆ ఇమెయిల్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో షేర్ చేశారు. అందులో 'Biggest Year Ever', 'Nothing's year of Innovation' అని పేర్కొంటూ 2025లో కంపెనీ ప్లాన్స్ గురించి పంచుకున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్డర్లో ఈ అప్‌కమింగ్ నథింగ్ ఫోన్ (3) లాంఛ్ చేయనున్నట్లు కూడా ఆ పోస్ట్ ద్వారా కన్ఫార్మ్ చేశారు. అంటే మార్చి 2025 నాటికి ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు.
ఆ ఇమెయిల్ స్క్రీన్ షాట్లో అప్‌కమింగ్ నథింగ్ ఫోన్ (3)ను 'ప్రపంచం చూసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్న చారిత్రాత్మక స్మార్ట్‌ఫోన్ లాంఛ్'గా వర్ణిస్తూ ఉంది. ఈ ఇమెయిల్ నథింగ్ ఫోన్ (3) గురించి పెద్దగా వివరాలను వెల్లడించనప్పటికీ, యూజర్ ఇంటర్ఫేస్ పరంగా విప్లవాత్మక ఆవిష్కరణలకు దారితీసే AI-ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను అందించే దిశగా నథింగ్ కంపెనీ ఫస్ట్ స్టెప్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
నథింగ్ ఫోన్ (3) స్పెసిఫికేషన్లు:ఈ స్మార్ట్‌ఫోన్‌పై లీక్ అయిన సమాచారం ప్రకారం నథింగ్ ఫోన్ (3) 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది HDR10+ సపోర్ట్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్ ఉండొచ్చు. ఈ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ద్వారా ఆధారితమైన ప్రీమియం డివైజ్‌ల కంటే ఒక జనరేషన్ పాతది అయినప్పటికీ, నిజానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ చిప్సెట్.