తెలంగాణ

telangana

ETV Bharat / technology

చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన ఎయిర్​టెల్, జియో, వీఐ!- డేటా అవసరంలేని వారికి ఇక పండగే! - NEW RECHARGE PLANS 2025

వాయిస్‌, SMSల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ లాంఛ్- ఇకపై డేటా కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదుగా!

Airtel vs Jio vs Vi: New Voice and SMS-only Plans
Airtel vs Jio vs Vi: New Voice and SMS-only Plans (Photo Credit- Airtel, Jio, Vi)

By ETV Bharat Tech Team

Published : Jan 24, 2025, 1:17 PM IST

Updated : Jan 24, 2025, 2:32 PM IST

New Recharge Plans 2025: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త రీఛార్జ్ ప్లాన్​లను లాంఛ్ చేశాయి. డేటా సేవలు అవసరం లేని వినియోగదారులకు ఉపయోగపడేలా కేవలం వాయిస్‌, SMSల కోసమే ప్రత్యేకంగా రీఛార్జ్​ ప్లాన్​లను తీసుకొచ్చాయి. అంటే ఈ రీఛార్జ్ ప్లాన్​లలో డేటా సదుపాయం లభించదు. దీంతో డేటా అవసరం లేని వినియోగదారులు ఇకపై అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్, జియో, వీఐ నుంచి వచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్​లపై ఓ లుక్కేద్దాం రండి.

ఎయిర్‌టెల్ కొత్త వాయిస్ అండ్ SMS-ఓన్లీ ప్లాన్స్:

  • రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్: ఎయిర్‌టెల్ కొత్తగా తీసుకొచ్చిన రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, మొత్తం 900 SMSలు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 84 రోజులు. వీటితో పాటు ఈ రీఛార్జ్​తో మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్​షిప్, ఉచిత హలో ట్యూన్స్‌ను కూడా పొందొచ్చు.
  • రూ. 1,959 ప్రీపెయిడ్ ప్లాన్:ఎయిర్‌టెల్ నుంచి వచ్చిన ఈ రూ. 1,959 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​తో వినియోగదారులకు అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3,600 SMSలు లభిస్తాయి. అంతేకాక ఈ ప్యాక్​తో కూడా మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్​షిప్, ఉచిత హలో ట్యూన్స్ కూడా ఉన్నాయి.

జియో కొత్త వాయిస్ అండ్ SMS-ఓన్లీ ప్లాన్స్:

  • రూ. 458 ప్రీపెయిడ్ ప్లాన్: జియో నుంచి వచ్చిన బేసిక్ వాయిస్ అండ్ SMS-ఓన్లీ ప్లాన్​ ధర రూ. 458. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​తో అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం 1,000 SMSలు లభిస్తాయి. వీటితోపాటు జియోటీవీ, జియోక్లౌడ్, జియోసినిమా (నాన్-ప్రీమియం వెర్షన్) వంటి జియో యాప్‌లకు యాక్సెస్ వస్తుంది.
  • రూ. 1,958 ప్రీపెయిడ్ ప్లాన్:ఈ రూ. 1,958 కొత్త వార్షిక వాయిస్ అండ్ SMS-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్‌లో అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3,600 SMSలు ఉంటాయి. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్​తో వినియోగదారులు జియోటీవీ, జియోక్లౌడ్, జియోసినిమా (నాన్-ప్రీమియం) వంటి జియో యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.

వీఐ కొత్త వాయిస్ అండ్ SMS-ఓన్లీ ప్లాన్:

  • రూ. 1,460 ప్రీపెయిడ్ ప్లాన్:వీఐ కూడా ట్రాయ్ ఆదేశాల మేరకు రూ. 1,460లతో బేసిక్ కాల్ అండ్ SMS రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ ఈ ప్లాన్​తో వినియోగదారులకు అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం 100 SMSలను అందిస్తుంది. ఇక దీని వ్యాలిడిటీ 270 రోజులు. అయితే ఈ రీఛార్జ్ ప్యాక్‌లో ఎటువంటి అదనపు ప్రయోజనాలు లేవు.

ఇంతకు ముందు ఈ టెలికాం కంపెనీలు అందించే రీఛార్జ్ప్లాన్​లలో డేటా సదుపాయం కూడా ఉండేది. అయితే ఇంటర్నెట్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాయిస్‌, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశించింది. ఈ క్రమంలో స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లు తీసుకురావాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్, జియో, వీఐ కేవలం వాయిస్‌, SMSల కోసమే ప్రత్యేకంగా రీఛార్జ్​ ప్లాన్​లను తీసుకొచ్చాయి.

ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్లు డేటా అవసరం లేని వినియోగదారులకు తక్కువ ధరలో లభిస్తాయి. ఇకపై వారు డేటా కోసం అనవసరంగా నగదు ఖర్చు చేయాల్సిన పనిలేదు. అయితే డేటా కూడా కావాలనుకునేవారికి మాత్రం ఇవి చాలా ఎక్స్పెన్సివ్​గా మారనున్నాయి. ఎందుకంటే డేటా కోసం వారు అదనంగా మరో రీఛార్జ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.

పనిచేయకుండా ఆగిపోయిన చాట్​జీపీటీ- గగ్గోలు పెడుతున్న వినియోగదారులు!

ట్రాయ్ ఆదేశాల మేరకు ఎయిర్​టెల్ కొత్త ప్లాన్స్- ఇకపై డేటా కోసం అనవసరంగా డబ్బు చెల్లించక్కర్లేదు!

అదిరే ఏఐ ఫీచర్లతో గెలాక్సీ S25 అల్ట్రా- ధర కూడా 14వేలు పెరిగిందిగా!- మరి అంత రేటుకు ఇది విలువైనదేనా?

Last Updated : Jan 24, 2025, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details