SpaceX Crew 9 Mission Launch: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ రెస్క్యూ మిషన్ క్రూ-9కి నాసా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. స్పేస్‌లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను తీసుకొచ్చేందుకు రెస్క్యూ మిషన్ ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ నుంచి ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. 'ఫాల్కన్ 9 సక్సెస్ఫుల్ లాంచ్ నేపథ్యంలో నాసా, స్పేస్ఎక్స్కి అభినందనలు.' అంటూ నాసా చీఫ్ బిల్ నెల్సన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ప్రయోగ షెడ్యూల్:
- కాగా మొదట ఈ మిషన్ షెడ్యూల్‌ను సెప్టెంబర్ 26కు ఫిక్స్ చేశారు.
- ఈ మిషన్ అంతరిక్ష నౌకను కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించాల్సి ఉండగా అక్కడ తుపాను ప్రభావం కారణంగా ఈ మిషన్ ప్రయోగ తేదీని శనివారానికి మార్చారు.
- వాస్తవానికి ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా వాతావరణం బాగోలేదు.
- హెలెన్ తుపాను బీభత్సం సృష్టించింది.
- వరదలు ముంచెత్తడంతో 50కిపైగా మంది ప్రజలు మరణించారు.
- 10లక్షలకుపైగా మంది ప్రజలు అంధకారంలో జీవిస్తున్నారు.
- ఈ నేపథ్యంలో స్పేస్ఎక్స్ క్రూ 9 లాంచ్ సాధ్యమవుతుందా? అనే అనుమానాలు రేకెత్తాయి.
- అయితే అదృష్టవశాత్తు భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10:47 గంటలకు ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
- అన్ని అనుకున్నట్లుగానే జరిగితే సోమవారం తెల్లవారుజాముకి ఇది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్)ను చేరుకోవచ్చు.
ఫిబ్రవరిలో విలియమ్స్ భూమిపైకి!:
- సునీతా విలియమ్స్‌తో పాటు తన తోటి వ్యోమగామి విల్మోర్ను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ ఫాల్కన్-9 రాకెట్లో వ్యోమగాములు నిక్ హాగ్వే, అలెగ్జాండర్ గార్బునోవ్ బయలుదేరారు.
- నిక్ హాగ్వే నాసా ఆస్ట్రొనాట్ కాగా అలెగ్జాండర్ గార్బునోవ్ రష్యన్ కాస్మొనాట్.
- ఈ ఫాల్కన్ 9ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ని తీసుకుని ఫిబ్రవరిలో భూమి మీదకు రానుంది.