Moto G24 Power Smart Phone Launch :ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా మంగళవారం మోటో జీ24 పవర్ అనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. దీనిలో 4జీబీ+128జీబీ; 8జీబీ+128జీబీ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. అయితే ఇది ఒక 4జీ ఫోన్. రూ.10,000 బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆశించే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
Moto G24 Power Specs : ఈ మోటో జీ24 పవర్ స్మార్ట్‌ఫోన్ 3డీ యాక్రిలిక్ గ్లాస్ (PMMA) ఫినిషింగ్‌తో వస్తుంది. 6000mAh బ్యాటరీ కలిగి ఉన్న అతిసన్నని స్మార్ట్‌ఫోన్ ఇది.
- డిస్ప్లే : 6.6 అంగుళాల ఎల్ఈడీ స్క్రీన్ + 90Hz రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్
- ర్యామ్ : 4 జీబీ & 8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 6000mAh బ్యాటరీ
- ఫాస్ట్ ఛార్జింగ్ : 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- రియర్ కెమెరా : 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరా + మైక్రో విజన్ కెమెరా
- ఫ్రంట్ కెమెరా : 16 MP
- కలర్ వేరియంట్స్ : గ్లేసియర్ బ్లూ, ఇంక్ బ్లూ
Moto G24 Power Price :ఈ మోటో జీ24 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవి 4జీబీ+128జీబీ; 8జీబీ+128జీబీ. అయితే 8 జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే 128 జీబీ స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. అలాగే దీనికి 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ ఆప్డేట్స్ వస్తాయి.
- 4జీబీ+128జీబీ వేరియంట్ మోటో జీ24 పవర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999గా ఉంది.
- 8జీబీ+128జీబీ వేరియంట్ మోటో జీ24 పవర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,999గా ఉంది.