Microsoft Satya Nadella About AI : టెక్ కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై లోతైన పరిశోధనలు చేపడుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏఐను మనుష్యుల్లా ట్రీట్ చేయడం ఆపాలని సూచించారు.
ఏఐ మనిషి కాదు!
టెక్ కంపెనీలు అన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నాయి. మనుష్యుల్లా నవ్వడం, పాడడం, అనుకరించడం సహా, వివిధ గొంతుకలతో మాట్లాడగలిగేలా ఏఐని అభివృద్ధి చేస్తున్నారు. చివరకు మనుష్యుల్లా ఆలోచించే మర మనుషులను తయారు చేయాలని తపిస్తున్నారు. అయితే, ఈ తరహా ప్రయోగాలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మనుషుల్లా భావించడం పూర్తిగా ఆపాలని సూచించారు.
ఏఐలో మనుష్యుల తరహా లక్షణాలు తీసుకురావాలనే ఆలోచన సరికాదని సత్యన నాదెళ్ల అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను కేవలం ఒక సాధనంగా మాత్రమే ట్రీట్ చేయాలని సూచించారు. మానుషులకు ఉపయోగించే నామవాచకాలు (పేర్లు), సర్వనామాలు ఏఐకు వాడకూడదని పేర్కొన్నారు.
'మనుషులకు మాత్రమే ఇంటెలిజెన్స్ ఉంటుంది. దానిని ఆర్టిఫీషియల్‌గా పొందాల్సిన అవసరం లేదు' అని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.
అసలు అలా పిలవడమే కర్టెక్ట్ కాదు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే పదమే సరిగ్గా లేదని సత్య నాదెళ్ల అన్నారు. దీనిని 'డిఫరెంట్ ఇంటెలిజెన్స్' అని వ్యవహరించి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు.