MG ZS HEV at Auto Expo 2025:JSW MG మోటార్ ఇటీవల గ్లోబల్‌గా లాంఛ్ చేసిన 'MG ZS HEV' కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రదర్శించింది. కంపెనీ దీన్ని 'MG ఆస్టర్' పేరుతో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయనుంది. ఈ కొత్త మోడల్‌తో ప్రస్తుతం ఉన్న 'MG ఆస్టర్'ను భర్తీ చేయనుంది. తద్వారా మార్కెట్లోని ఇతర కాంపాక్ట్ SUV ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. అయితే కంపెనీ ఈ నయా మోడల్ పవర్‌ట్రెయిన్‌పై ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. దీంతో దీని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ గురించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.
MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్: ఈ కొత్త MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ కంటే మరింత అప్డేటెడ్, ప్రీమియం లుక్‌తో వస్తుంది. దీని ఫ్రంట్ గ్రిల్ మునుపటి కంటే పెద్దదిగా, మరింత విశాలంగా ఉంటుంది. ఈ కారు పైభాగంలో క్రోమ్ స్లాట్లతో చిన్న విభాగం ఉంది. దాని పైన పెద్దగా MG లోగో కన్పిస్తుంది. సెంటర్ గ్రిల్ సైడ్స్‌లో రెండు C-ఆకారపు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి కొంచెం అగ్రెసివ్ లుక్‌లో కన్పిస్తాయి.
ఈ కారులోఅమర్చిన హెడ్లైట్లు ఎప్పటిలాగానే ట్రెడీషనల్ టైప్‌లోనే ఉంటాయి. అయితే ఇక్కడ మనకు LED DRLతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ లభిస్తుంది. ఈ SUVకి మంచి ఆకర్షణీయమైన లుక్ అందించేందుకు సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను కింది భాగంలో ఏర్పాటు చేశారు. మొత్తంమీద ఈ కారు అదే పాత సిల్హౌట్‌ను కలిగి ఉంది. కానీ దీనికి లార్జెర్ క్వార్టర్ గ్లాస్, మరింత స్టైలిష్ అల్లాయ్ వీల్ డిజైన్ ఉంది. అయితే దీని ORVMలు, బాడీ క్లాడింగ్ వంటి ఇతర ఎలిమెంట్స్ ప్రస్తుత మోడల్ని పోలి ఉంటాయి.
MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్: కారు వెనక భాగంలో సరికొత్త విండ్‌స్క్రీన్ ఉంది. ఇది ప్రస్తుత MG ఆస్టర్ కంటే పెద్దదిగా, తక్కువ గుండ్రటి సైజ్‌లో ఉంటుంది. దీని LED టెయిల్ లైట్లు, దిగువ రిఫ్లెక్టర్లు మునుపటి కంటే మంచి లుక్‌లో అందించారు. ఇక ఈ కారు వెనక బంపర్.. సిల్వర్ ఫినిషింగ్, ట్విన్ ఎగ్జాస్ట్‌లతో స్ప్లిట్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో వస్తుంది. అయితే దీని రియల్ ఎగ్జాస్ట్ బంపర్ వెనక ఉంటుంది.