Mercedes-Benz G 580 EV:మార్కెట్లోకి మరో లగ్జరీ కారు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. మెర్సిడెస్-బెంజ్ ఇండియా తన EQ టెక్నాలజీతో 'G 580 EV'ని మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. కంపెనీ ఈ కారును 9 జనవరి 2025న భారత మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 473 కిమీల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. EQ టెక్నాలజీతో ఈ కొత్త 'G 580 EV' అనేది ఐకానిక్ G-క్లాస్ ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ కారు. ఇది క్వాడ్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది.
డిజైన్ అండ్ ఎక్స్టీరియర్: స్టాండర్డ్ ఇంటర్నల్ కంబస్టన్ G-క్లాస్ వెర్షన్‌తో పోలిస్తే దీనిలో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. దీని ముందు భాగంలో ఫోర్-స్టాట్ గ్రిల్ ఒక క్లోజ్డ్ ప్యానెల్‌తో ఇండియాలోకి వస్తుంది. అయితే గ్లోబల్ మార్కెట్ కస్టమర్లుకు మాత్రం చుట్టూ లైట్లతో EQ-స్టైల్ బ్లాంక్డ్- అవుట్ గ్రిల్ అందుబాటులో ఉంటుంది. ఎ-పిల్లర్‌తో పాటు క్లాడింగ్‌లో మార్పులతో పాటు బంపర్‌లలో కూడా స్వల్ప మార్పులతో ఇది వస్తుంది.
దీని వెనక భాగంలో ఒక రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, వెనక చక్రాల ఆర్జ్లపై ఎయిర్ కర్టెన్ ఉంది. అంతేకాక ఇది స్క్వేర్ స్టోరేజీ బాక్స్‌తో రీప్లేసింగ్ బూట్-మౌంటెడ్ స్పేర్ వీల్ ఉంది. దీనిలో ఛార్జింగ్ కేబుల్స్, టూల్స్‌తో పాటు అనేక ఇతర వస్తువులను ఉంచొచ్చు.
ఇంటీరియర్:దీని ఇంటీరియర్ విషయానికొస్తే ICE వెర్షన్ G-క్లాస్‌తో పోలిస్తే ఇందులో పెద్దగా మార్పు లేదు. దాని డ్యాష్‌బోర్డ్‌లో రెండు 12.3 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలు ఇన్‌స్టాల్ అయి ఉన్నాయి. ICE మోడల్‌తో పోలిస్తే దీని డిస్‌ప్లేపై EQ-స్పెసిఫిక్ గ్రాఫిక్స్, ట్రెడిషనల్ థ్రీ-లాక్ట్డ్ డిఫెరెన్షియల్ స్విచ్‌లు ఉన్నాయి. 'ట్యాంక్ టర్న్' ఫీచర్, లో రేంజ్ యాక్టివ్ చేసేందుకు వీటిని రీప్లేస్ చేశారు.
పవర్‌ట్రెయిన్: ఈ మెర్సిడెస్ బెంజ్ 'G 580 EV'లో క్వాడ్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఉంది. దీని కారణంగా ఇది 579 bhp శక్తిని, 1,164 Nm అద్భుతమైన టార్క్‌ను అందిస్తుంది. దీని మోటార్.. కారుఅండర్ ఫ్లోర్‌లో అమర్చిన 116 kWh బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతుంది.