Additional Coaches in Vande Bharat Train : విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా అదనంగా కోచ్‌లను పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేస్తున్నట్లు తెలిపింది. ఈ అదనపు కోచ్‌లు జనవరి 11వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మరో 4 కోచ్‌లు పెంచడం ద్వారా ఇప్పటివరకు 1,128 మందికి ప్రయాణ సౌకర్యం ఉండగా, ప్రస్తుతం ప్రయాణికుల కెపాసిటీ 1,414కు చేరుకుంది.
పెరిగిన కెపాసిటీ : వందేభారత్ రైలుకు అదనంగా నాలుగు కోచ్‌లు జత చేశాక ఛైర్‌కార్ బోగీల సంఖ్య 14 నుంచి ఏకంగా 18కి పెరిగింది. ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ 1,024 నుంచి 1,336కు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ రెండు బోగీల్లో కలిపి మొత్తంగా 104 మంది ప్రయాణం చేయొచ్చు. దీంతో రైలు మొత్తం సీటింగ్ కెపాసిటీ 1,414కి చేరినట్లు అయింది.
'రైలు పట్టాలపైనే నా జీవితం స్టార్ట్- అందుకే 2నెలల్లో రూ.11లక్షల కోట్ల ప్రాజెక్టులు!'