ETV Bharat / technology

ఐఫోన్ మీపై నిఘా పెడుతోందా?- మీ మాటలు సీక్రెట్​గా రికార్డ్ చేస్తోందా?- సిరి దుర్వినియోగంపై యాపిల్ సమాధానమిదే! - APPLE SIRI DATA LEAK CASE

డేటాను ఎవరికీ అమ్మేయలేదు- ఆరోపణలపై యాపిల్ ప్రకటన- సిరి ప్రైవసీ ఫోకస్డ్ ఫీచర్ల వివరాల వెల్లడి!

Apple Siri Data Leak Case
Apple Siri Data Leak Case (Photo Credit- Apple)
author img

By ETV Bharat Tech Team

Published : 10 hours ago

Updated : 9 hours ago

Apple Siri Data Leak Case: టెక్ దిగ్గజం యాపిల్ ఎదుర్కొంటున్న సిరి దుర్వినియోగం ఆరోపణలపై తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ మార్కెటింగ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేందుకు, దాని అడ్వర్టైజింగ్ కోసం ఎప్పుడూ సిరి డేటాను వినియోగించలేదని పేర్కొంది. దీంతోపాటు ఏ విధమైన ప్రయోజనం కోసమూ ఈ డేటాను ఎవరితోనూ పంచుకోలేదని (అమ్మేయలేదని) తెలిపింది. అయితే తనపై దాఖలైన దావా కేసును పరిష్కరించేందుకు 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరించిన తర్వాత యాపిల్ ఈ స్టేట్మెంట్ విడుదల చేయడం గమనార్హం.

కాగా యాపిల్ వర్చువల్ అసిస్టెంట్ సిరిని స్పై గా మార్చి ఐఫోన్లు, ఇతర డివైజ్​ల యూజర్లపై నిఘా పెట్టిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈ మేరకు యాపిల్ సిరిని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని పేర్కొంటూ కంపెనీపై అమెరికా ఫెడరల్‌ కోర్టులో దావా దాఖలైంది.

ఇలా వినియోగదారుల అనుమతి లేకుండా సిరితో యూజర్ల ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేసి వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని ఆరోపించారు. అయితే దీనిపై ఇటీవల స్పందించిన యాపిల్ దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది.

ఇక యాపిల్ తాజాగా విడుదల చేసిన ప్రకటన విషయానికి వస్తే అందులో కంపెనీ 'లాంగ్-టెర్మ్ ప్రైవసీ కమిట్మెంట్ విత్ సిరి' అని పేర్కొంది. దీనితో పాటు సిరిని మరింత ప్రైవేట్​గా మార్చేందుకు నిరంతరం సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నట్లు, దాన్ని ఇలాగే కొనసాగిస్తామంటూ వివరించింది. వినియోగదారులు ఎంచుకుంటే తప్ప సిరి సంభాషణలను రికార్డ్ చేయదని వెల్లడించింది. ఇలా చేసిన రికార్డింగ్స్​ కూడా ఆ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేసింది. కావాలంటే వినియోగదారులు ఎప్పుడైనా దీన్ని నిలిపివేయవచ్చని తెలిపింది.

ఈ సందర్భంగా యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ సిరి యూజర్ ప్రైవసీ ఫోకస్డ్ ఫీచర్ల వివరాలనూ వెల్లడించింది. సిరి రిక్వస్ట్​ల కోసం కంపెనీ చాలా తక్కువ డేటాని సేకరించి ఉంచుతుందని పేర్కొంది. దీంతో ఇలాంటి సమయంలో సిరి వీలైనంత వరకు ఆన్-డివైస్ ప్రాసెసింగ్‌ను ఉపయోగిస్తుందని వెల్లడించింది. ఇలా వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు యూజర్ డివైజ్​లోనే సాధ్యమైనంత ఎక్కువ ప్రాసెసింగ్‌ను నిర్వహించేలా సిరిని డిజైన్ చేసినట్లు తెలిపింది. దీంతో ఇది యాపిల్ సర్వర్​లకు వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయకుండా, విశ్లేషించకుండా, వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అనుమతిస్తుందని పేర్కొంది.

అయితే కొన్ని ఫీచర్లకు యాపిల్ సర్వర్ల నుంచి రియల్ టైమ్ ఇన్​పుట్ అవసరమని కంపెనీ అంగీకరించింది. ఆ సందర్భాలలో కచ్చితమైన ఫలితాలను అందించడం కోసం సిరి వీలైనంత వరకు చాలా తక్కువ డేటానే వినియోగిస్తుందని పేర్కొంది. సిరి సెర్చెస్, రిక్వస్ట్​లను ట్రాక్ చేసేందుకు యూజర్ యాపిల్ అకౌంట్ లేదా ఫోన్​ నంబర్​కు లింక్ చేయడానికి బదులుగా, రాండమ్ ఐడెంటిఫైయర్ (అక్షరాలు, సంఖ్యలతో పొడవైన స్ట్రింగ్​)ను ఉపయోగిస్తామని యాపిల్ తెలిపింది. ఈ విధానం యూజర్ ఐడెంటిటీని గోప్యంగా ఉంచడంలో సహాయపడుతుందని పేర్కొంది.

దీంతోపాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రారంభించిన సిరి కొత్త, మెరుగైన సామర్థ్యాలను కూడా ప్రస్తావించింది. కంపెనీ తన అనేక ఇంటెలిజెన్స్ మోడల్స్ నేరుగా డివైజ్​లోనే నడుస్తున్నప్పటికీ, లార్జ్ మోడల్స్​కు అవసరమయ్యే రిక్వస్ట్​ల కోసం ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్‌ను ఉపయోగిస్తుందని తెలిపింది. అయితే సిరి ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్‌ను ఉపయోగించినప్పుడు యూజర్ల డేటాను యాపిల్ స్టోర్​ లేదా యాక్సెస్ చేయదని వివరించింది. కేవలం రిక్వస్ట్​ను ఫుల్​ఫిల్ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త నంబర్ల నుంచి మిస్డ్​కాల్స్ వస్తున్నాయా?- తిరిగి చేశారో ఇక అంతే!- అలాంటి సమయంలో ఏం చేయాలంటే?

ఇస్రో స్పేడెక్స్ డాకింగ్ మరోసారి వాయిదా- ఇన్నిసార్లు పోస్ట్​పోన్ ఎందుకు?- శాస్త్రవేత్తల ముందున్న సవాల్ అదేనా?

భారత్​లో 5.5G వచ్చేసిందోచ్- ఇకపై ఎక్కడ ఉన్నా సూపర్​ ఫాస్ట్ నెట్​వర్క్!- ఇది ఏ డివైజ్​లో పనిచేస్తుందంటే?

Last Updated : 9 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.