Mercedes AMG C 63 S E Performance: వాహన ప్రియులకు శుభవార్త. మార్కెట్లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్తన కొత్త మెర్సిడెస్ AMG C63 S E పెర్ఫార్మెన్స్ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త కారు 3.4 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది. 2025 సెకండ్ క్వార్టర్లో దీని డెలివరీలు ప్రారంభం కానున్నప్పటికీ కంపెనీ ఈ పెర్ఫార్మెన్స్ సెడాన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
ఎక్స్టీరియర్:ఈ కొత్త కారు షేప్ మెర్సిడెస్ C-క్లాస్ సెడాన్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది AMG డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. దీంతో ఇది చాలా డిఫరెంట్‌గా కన్పిస్తుంది. దీని ముందు భాగం చాలా పొడవుగా ఉంటుంది. విశాలమైన ఫెండర్లను కలిగి ఉంటుంది. దీంతో ఇది ఎగ్రెసివ్ లుక్‌లో ఉంటుంది.
దీని ముందు భాగంలో C-క్లాస్ సెడాన్ మాదిరిగానే LED DRLలతో కూడిన LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి. AMG మోడల్‌ల మాదిరిగానే కంపెనీ ఈ సెడాన్‌లో కూడా సాధారణ మెర్సిడెస్ స్టార్ స్థానంలో బ్లాక్ AMG బ్యాడ్జ్‌ను ఇచ్చింది. కారునిలువు స్లాట్‌లతో కూడిన AMG-స్పెసిఫిక్ గ్రిల్, మరింత ఎగ్రెసివ్ లుక్‌లో కనిపించే ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంది.
వీటితో పాటు గ్రిల్ వెనక, బంపర్‌లో రెండు ఎలక్ట్రిక్ కంట్రోల్డ్ ఎయిర్ ఇన్‌టెక్స్ ఉన్నాయి. ఇవి అవసరానికి అనుగుణంగా ఎయిర్ ఫ్లోను సర్దుబాటు చేస్తాయి. AMG C 63 S E పెర్ఫార్మెన్స్ సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే.. ఇది స్పోర్టీ సైడ్ స్కర్ట్స్, 19-అంగుళాల AMG అల్లాయ్ వీల్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంది. అయితే కస్టమర్లు వారికి కావాలంటే దానిలో బిగ్ 20-అంగుళాల ఫోర్జ్డ్ వీల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
కారు ప్రొఫైల్‌ను పరిశీలిస్తే అందులో బ్లాక్ డిఫ్యూజర్, ఇరువైపులా రెండు ట్రాపెజోయిడల్ ఎగ్జాస్ట్ టిప్స్, బూట్ లిడ్‌పై బ్లాక్ స్పాయిలర్ ఉన్నాయి. అయితే టెయిల్‌లైట్‌లు సాధారణ సి-క్లాస్ మాదిరిగానే ఉంటాయి. వీటితో పాటు లెఫ్ట్ రియర్ ఫెండర్‌పై ప్లగ్-ఇన్ ఛార్జింగ్ ఫ్లాప్, రెడ్ హైలైట్‌లతో కూడిన మోడల్ బ్యాడ్జ్ ఇన్‌స్టాల్ చేశారు. ఇది స్టాండర్డ్ సి-క్లాస్ మోడల్‌కు భిన్నంగా ఉంటుంది.