తెలంగాణ

telangana

ETV Bharat / technology

మార్బుల్ ఫినిష్​తో లావా కొత్త 5G ఫోన్- కేవలం రూ.9,499లకే!- ఇంటివద్దే ఫ్రీ సర్వీస్ కూడా! - LAVA YUVA 2 5G LAUNCHED

లావా కొత్త 5G స్మార్ట్​ఫోన్ చూశారా?- కళ్లు చెదిరే డిజైన్​లో భలే ఉందిగా!

Lava Yuva 2 5G Launched
Lava Yuva 2 5G Launched (Photo Credit- Lava Mobiles)

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2024, 8:04 PM IST

Lava Yuva 2 5G Launched: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో హై-స్పీడ్ కనెక్టివిటీకి డిమాండ్ పెరుగుతోంది. దీంతో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మార్కెట్లోకి కొత్త కొత్త 5G స్మార్ట్​ఫోన్లను తీసుకొచ్చేందుకు స్మార్ట్​ఫోన్ తయారీ కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దేశీయ మార్కెట్లో చాలానే 5G స్మార్ట్​ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త 5G స్మార్ట్​ఫోన్ మార్కెట్లో లాంఛ్ అయింది. దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ 'లావా యువ 2 5G' పేరుతో దీన్ని తీసుకొచ్చింది.

మార్బుల్‌ ఫినిష్‌తో ఆకర్షణీయమైన డిజైన్​తో కంపెనీ దీన్ని బడ్జెట్ ధరలోనే రిలీజ్ చేసింది. అంతేకాక ఏడాదిలోపు ఫోన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేకుండా నేరుగా ఇంటికే వచ్చి సర్వీస్‌ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. డ్యూయల్‌ సిమ్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్​ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారంగా పనిచేస్తుంది. లావా రిటైల్‌ స్టోర్ల ద్వారా ఈ స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేయొచ్చు. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

'Lava Yuva 2 5G' ఫీచర్లు:

  • డిస్​ప్లే: 6.67 అంగుళాల హెచ్‌డీ + స్క్రీన్
  • బ్రైట్‌నెస్‌:700నిట్స్‌
  • రీఫ్రెష్‌ రేటు:90Hz
  • ప్రాసెసర్: UNISOC T760
  • బ్యాటరీ: 5000mAh
  • 18W వైర్డ్‌ ఛార్జింగ్‌ సదుపాయం

'Lava Yuva 2 5G' కెమెరా సెటప్:ఈ కొత్త లావా యువ 2 5G స్మార్ట్​ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 2MP సెన్సర్‌ ఉంది. సెల్ఫీల కోసం దీని ముందువైపు 8MP కెమెరా అందించారు. నోటిఫికేషన్ వస్తే ఈ కెమెరా చుట్టూ ఉన్న లైట్ బ్లింక్ అవుతుంది.

కనెక్టివిటీ ఫీచర్లు:

  • 3.5mm ఆడియో జాక్‌
  • బ్లూటూత్‌ 5.2
  • యూఎస్‌బీ టైప్‌- సి పోర్ట్‌

'Lava Yuva 2 5G' కలర్ ఆప్షన్స్: దేశీయ మార్కెట్లో ఇది రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

  • మార్బుల్‌ బ్లాక్‌
  • మార్బుల్‌ వైట్‌
Lava Yuva 2 5G (Photo Credit- Lava Mobiles)

ABOUT THE AUTHOR

...view details