'Lava Yuva 2 5G' vs 'Moto G35 5G':దేశీయ మార్కెట్లో మొన్ననే 'లావా యువ 2 5G'ని స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూ. 9,499 ప్రారంభ ధరతో తీసుకొచ్చింది. ఇది అదిరే AI ఫీచర్లతో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే దీనికి పోటీగా మార్కెట్లో చాలానే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. వాటిలో 'మోటో G35 5G' కూడా ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా కేవలం రూ.10వేలకే అందుబాటులో ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎందులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి? వంటి వివరాలు తెలుసుకునేందుకు వాటి కంపారిజన్ మీకోసం. ఈ వివరాలను బట్టి వాటిలో మీకు ఏ ఫోన్ సరైనదో మీరే సెలక్ట్ చేసుకోవచ్చు.
డిస్ప్లే స్పెసిఫికేషన్స్:
Display specifications | Lava Yuva 2 5G | Moto G35 5G |
డిస్ప్లే సైజ్ | 6.67 అంగుళాలు | 6.72 అంగుళాలు |
టెక్నాలజీ | IPS | LTPS LCD |
స్క్రీన్ రిజల్యూషన్ | 720 x 1612 పిక్సెల్స్ HD+ | 2400 x 1080 పిక్సెల్స్, Full HD+ |
రీఫ్రెష్ రేట్ | 90Hz | 120Hz |
డిస్ప్లే ప్రొటెక్షన్ | - | గొరిల్లా గ్లాస్ 3 |
టచ్‌స్క్రీన్ | కెపాసిటివ్ టచ్ | కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ |
ప్రాసెసర్:
Processor | Lava Yuva 2 5G | Moto G35 5G |
చిప్సెట్ | UNISOC T760 5G 6nm | UNISOC T760 (6 nm) |
CPU | ఆక్టా-కోర్ ప్రాసెసర్ | ఆక్టా కోర్ (1x2.2 GHz Cortex-A76 & 3x Cortex-A76 & 4x Cortex-A55) |
GPU | - | Mali-G57 MC4 @650Hz |
స్టోరేజీ:
Storage | Lava Yuva 2 5G | Moto G35 5G |
ఇంటర్నల్ స్టోరేజ్ | 128GB | 128GB/256GB |
RAM | 4GB+4GB | 4/8 GB RAM |
ఎక్స్టర్నల్ స్టోరేజ్ | 512GB | 1TB వరకు |
కార్డ్ స్లాట్ | MicroSD | MicroSD |
కెమెరా:
Camera | Lava Yuva 2 5G | Moto G35 5G |
ప్రైమరీ కెమెరా | LED ఫ్లాష్‌తో 50MP+2MP AI డ్యూయల్ కెమెరా | 50MP (f/1.8, వైడ్) + 8MP (f/2.2, అల్ట్రావైడ్) వెనక సింగిల్ LED ఫ్లాష్ |
ఫ్రంట్ కెమెరా | 8MP | 16MP (f/2.5, వైడ్) |
వీడియో రికార్డింగ్ | Yes | UHD@30fps, FHD@30fps |
కెమెరా ఫీచర్లు | ప్రో మోడ్, పనోరమా, ఫిల్టర్, టైమ్ లాప్స్, స్లో మోషన్, నైట్ మోడ్, ఇంటెలిజెంట్ స్కానింగ్, పోర్ట్రెయిట్ మోడ్, AI మోడ్, బర్స్ట్ మోడ్, బ్యూటీ మోడ్, HDR మోడ్ | పోర్ట్రెయిట్, నైట్ విజన్, ప్రో, 360 డిగ్రీ పనోరమా, గెస్చర్ క్యాప్చర్, గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ |
బ్యాటరీ:
Battery | Lava Yuva 2 5G | Moto G35 5G |
టైప్ | 5000mAh బ్యాటరీ | నాన్-రిమూవబుల్ Li-Ion 5000 mAh బ్యాటరీ |
ఛార్జింగ్ | 18W | 18W టర్బోపవర్ క్విక్ ఛార్జింగ్ |
స్టాన్ బై | 510 గంటలు | - |
టాక్ టైమ్ | 30 గంటలు | - |