Major Blast in Yadagirigutta : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం పెద్ద కందుకూరు శివారులో ఉన్న ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో ఉదయం భారీ పేలుడు సంబంధించింది. ఈ బ్లాస్ట్‌లో జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన కనకయ్య అనే వ్యక్తి మృతి చెందగా, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాశ్‌కు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలు కాగా, మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీలో ఉదయం 9.45 గంటల ప్రాంతంలో పీఆర్డీసీ బిల్డింగ్-3లో పెల్లెట్ ఫార్ములా తయారు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో బిల్డింగ్‌లో మొత్తం నలుగురు కార్మికులు పని చేస్తున్నారు. లంచ్ సమయం కావడంతో కార్మికులంతా బయటకు రాగా, నలుగురు మాత్రమే బిల్డింగ్‌లో ఉన్నారు.
గ్యాస్ లీక్ కావడంతో బ్లాస్ట్ : గ్యాస్ లీక్ కావడంతో బ్లాస్ట్ సమయంలో భారీ సౌండ్ వచ్చింది. ప్రమాద స్థలికి వెళ్లడానికి సమయం పడుతుందని, పూర్తి విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని పరిశ్రమ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ వెల్లడించారు. బ్లాస్టింగ్ ఘటన యాదగిరిగుట్ట మండలంలోని సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు భారీ శబ్దం వినపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
సంఘటనా స్థలాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సందర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, యాజమాన్యం కేవలం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుంది కానీ కార్మికుల సేఫ్టీని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడినట్లు, గతంలో కూడా ఈ సేఫ్టీపై హెచ్చరించినట్లు ప్రభుత్వ విప్ చెప్పారు.
గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెషర్ పేలుడు - అయిదుగురు దుర్మరణం - blast in south glass factory
పేలిన గ్యాస్ సిలిండర్ - కాలిబూడిదైన ఇల్లు - తప్పిన ప్రాణనష్టం