Kawasaki KLX230 Launched in India:బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. మార్కెట్లోకి ప్రీమియం ఫీచర్లతో సరికొత్త మోటార్‌సైకిల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కవాసకి ఇండియా దీన్ని తీసుకొచ్చింది. 'కవాసకి KLX230' పేరుతో దీన్ని తీసుకొచ్చారు. కంపెనీ ఈ డర్ట్ బైక్‌ను రూ. 3.30 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో విడుదల చేసింది. ఈ ధరతో ఇది ఇండియాలో అత్యంత ఖరీదైన రోడ్- లీగల్ డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్‌గా మారింది. ఈ సందర్భంగా దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.
స్పెసిఫికేషన్లు:ఈ కొత్త 'కవాసకి KLX230' బైక్ 233cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8,000rpm వద్ద 18bhp శక్తి, 6,400rpm వద్ద 18.3Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
అయితే ఈ మోటార్ సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్ చాలా చిన్నది. ఇది కేవలం 7.6 లీటర్లు మాత్రమే. ఇది ముందువైపు 240mm ట్రావెల్‌తో 37mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనకవైపు 250mm ట్రావెల్‌తో కూడిన మోనోషాక్ అబ్జార్బర్‌ని కలిగి ఉంది.
ఫీచర్లు:ఈ కొత్త 'కవాసకి KLX230' మోటార్‌లోని ఫీచర్ లిస్ట్ చాలా తక్కువ. ఈ బైక్ మోనోటోన్ LCDని కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. వీటితో పాటు ఈ మోటార్‌సైకిల్ డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. ఈ కొత్త బైక్ లైట్ వెయిట్‌తో వస్తుంది. దీని బరువు 139 కిలోలు. ఇక ఈ బైక్ 880mm ఎత్తుతో సీటును కలిగి ఉంది. కావాలంటే ఈ బైక్‌లో తక్కువ ఎత్తున్న సీటు ఆప్షన్ కూడా ఉంది.