Jio Cheapest Data Voucher:ఇండియాలోని నంబర్ వన్ మొబైల్ నెట్వర్క్ రిలయన్స్ జియో సంచలనానికే మారుపేరు. ఇది టెలికాం రంగంలోకి అడుగుపెడుతూనే విప్లవం తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ డేటాను తక్కువ ధరకే పరిచయం చేసింది. ఆ తర్వాత కూడా మరెన్నో ఆశ్చర్యకర ప్రకటనలు చేసింది. తాజాగా ఈ టెలికాం దిగ్గజ సంస్థ సరికొత్త చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.11 రీఛార్జితో 10GB హై-స్పీడ్ డేటా ప్లాన్‌ను లాంచ్ చేసింది. దీంతో జియో యూజర్లు ఇకపై పండగ చేసుకోనున్నారు. అయితే ఇందులో ఓ మెలిక ఉంది. అదేంటంటే?
రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ రోజువారీ డేటా లిమిట్ అయిపోయాక అదనపు డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఉపయోగపడుతుంది. కానీ దీని వ్యాలిడిటీ కేవలం గంట మాత్రమే ఉంటుంది. అయితే గంటలోపు 10GB డేటా పూర్తయిపోయినా 64kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చని జియో తెలిపింది.
దేశంలోనే చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇదే!:జియో తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఇండియాలోనే అత్యంత చవకైన డేటా ప్యాక్. ఇందులో మరో విశేషమేంటంటే.. ఈ వోచర్ బేస్ ప్యాక్ లేకుండా కూడా పనిచేస్తుంది. అయితే ఈ సందర్భంలో మీ కనెక్టివిటీ కేవలం ఇంటర్నెట్కు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ ప్యాక్‌లో కంపెనీ కాల్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ను అందించడం లేదు.