JIO iActivate Service:రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం సరికొత్త తరహా సేవలను ప్రారంభించింది. జియో సిమ్ యాక్టివేషన్ కోసం జియో ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఐయాక్టివేట్ (iActivate) సర్వీసులను ప్రారంభించింది. దీంతో ఇకపై ఎక్కడైనా, ఎప్పుడైనా జియో సిమ్‌కార్డ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఐయాక్టివేట్ సర్వీసులతో సిమ్ యాక్టివేట్ చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐయాక్టివేట్ సర్వీసులను ఉపయోగించుకోవటం ఎలా?:
- రిలయన్స్ జియో ఇప్పటికే సిమ్ కార్డ్‌లను ఉచితంగా హోమ్ డెలివరీ చేయటం ప్రారంభించింది.
- తాజాగా తీసుకొచ్చిన ఐయాక్టివేట్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ యాక్టివేట్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది.
- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్స్ తమ స్మార్ట్‌ఫోన్ సాయంతో సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసుకోవచ్చు.
- దీని కోసం ‘My Jio యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- యాప్ ఓపెన్ చేయగానే ఐయాక్టివేట్ బ్యానర్ కన్పిస్తుంది.
- దానిపై క్లిక్ చేసి మీ పేరు, ఫోన్ నంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేసి OTPని జనరేట్ చేయాలి.
- OTP ఎంటర్ చేయగానే eSIM, Physical SIM అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
- వాటిలో మీకు కావల్సిన ఆప్షన్ ఎంచుకుని Go for Jio iActivate పై క్లిక్ చేయాలి.
- ఆధార్ ఓటీపీ లేదా డిజీలాకర్ సాయంతో కేవైసీ పూర్తి చేయాలి. ఇలా ఇంటికి వచ్చిన సిమ్‌ను మొబైల్ సాయంతో లైవ్ ఫొటో/వీడియో తీసుకొని, లైవ్‌లోనే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఇలా ఈ ఐయాక్టివేట్ సర్వీసులను ఉపయోగించుకుని సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు.
- లేదంటే డెలివరీ ఏజెంట్లు సాయంతోనూ ఈ ప్రాసెస్ పూర్తి చేయించుకోవచ్చు.