తెలంగాణ

telangana

ETV Bharat / technology

'మాన్స్టర్​ హాలో' లైట్ ఎఫెక్ట్​తో ఐకూ స్మార్ట్​ఫోన్- డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే..! - IQOO 13 LAUNCH IN INDIA

ఐకూ నుంచి పవర్​ఫుల్ స్మార్ట్​ఫోన్ వచ్చేస్తోంది- ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడో తెలుసా..?

iQOO 13
iQOO 13 (X/IQOO India)

By ETV Bharat Tech Team

Published : Dec 2, 2024, 7:50 PM IST

iQOO 13 Launch in India: ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ తన కొత్త 'IQOO 13' మొబైల్​ను రేపు లాంఛ్ చేయబోతోంది. కంపెనీ ఈ ఫోన్​ను ఇటీవలే చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం దీన్ని భారత మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఈ సందర్భంగా కంపెనీ దీని ఇండియన్ వేరియంట్ స్పెసిఫికేషన్​ల గురించి కొంత సమాచారాన్ని రివీల్ చేసింది.

ఈ మొబైల్​ను పవర్​ఫుల్ క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో తీసుకురానున్నట్లు ఐకూ తెలిపింది. చైనాలో రిలీజ్ చేసిన 'IQOO 13'తో పోలిస్తే, ఇండియన్ వేరియంట్‌లో ఇది చిన్న బ్యాటరీతో వస్తుందని వెల్లడించింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్​ఫామ్ అమెజాన్​లో ఈ స్మార్ట్​ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఐకూ తెలిపిన వివరాల ప్రకారం 'IQOO 13' ఫీచర్లు ఇలా:

  • డిస్​ప్లే: 6.82-అంగుళాల LTPO AMOLED ఫ్లాట్ స్క్రీన్
  • రిజల్యూషన్:2K
  • రిఫ్రెష్​ రేట్: 144Hz
  • ప్రాసెసర్:క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్​
  • వెనక కెమెరా: 50MP ప్రైమరీ (Sony IMX921) + 50MP అల్ట్రా-వైడ్ + 50MP టెలిఫోటో
  • ఫ్రంట్ కెమెరా: 32MP
  • బ్యాటరీ: 6,000mAh
  • ఛార్జింగ్:120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • ఆపరేటింగ్ సిస్టమ్​:ఆండ్రాయిడ్ 15 బేస్డ్ FunTouchOS 15
  • అప్​డేట్స్:4 ఆండ్రాయిడ్ అప్​డేట్స్, 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్​డేట్స్
  • ప్రొటెక్షన్: IP68/IP69

దీనిలో గేమింగ్​ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్​ ప్రాసెసర్​తో పాటు Q2 సూపర్​ కంప్యూటింగ్​ను అందించారు. ఇది 2K గేమ్ సూపర్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది గ్రాఫిక్స్​ను మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాక ఈ స్మార్ట్​ఫోన్​లో ఉండే వేపర్​ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ వేడెక్కకుండా కాపాడుతుంది.

  • కెమెరా సెటప్:ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 50MP 2x టెలిఫోటో సెన్సార్ ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఇందులో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఇది 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్​ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్సీతో ఈ ఫోన్IP68, IP69 రేటింగ్స్​ కలిగి ఉందని కంపెనీ చెబుతోంది.
  • డిజైన్: ఈ స్మార్ట్​ఫోన్ 'మాన్స్టర్​ హాలో' లైట్ ఎఫెక్ట్​ను కలిగి ఉంది. ఈ డిజైన్ కెమెరా మాడ్యూల్ చుట్టూ ఉంది. ఇది మొబైల్​లో కాల్, మెసేజ్ లేదా ఛార్జింగ్ వంటి నోటిఫికేషన్స్​ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.
  • కలర్ ఆప్షన్స్: ఇది ఇండియన్ మార్కెట్లోకి రెండు కలర్ ఆప్షన్లతో ఎంట్రీ ఇవ్వనుంది. వాటిలో మొదటిది 'నార్డో గ్రే' (ఇటాలియన్ రేసింగ్ కారు డిజైన్ బేస్డ్), రెండోది లెజెండ్ ఎడిషన్' (BMW మోటార్‌స్పోర్ట్ లాంటి మూడు రంగుల చారలతో వస్తుంది.
  • ధర:చైనీస్​ మార్కెట్లో 'iQOO 13' 12GB RAM + 256GB వేరియంట్ ధర CNY 3,999 (దాదాపు రూ. 47,200) నుంచి ప్రారంభమవుతుంది. దీని 16GB + 1TB RAM అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర CNY 5,199 (సుమారు రూ. 61,400) వరకు ఉంటుంది.

నివేదికల ప్రకారం..ఇండియన్ మార్కెట్లో దీని బేస్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 55,000 కంటే తక్కువగా ఉండొచ్చు. అయితే ఇది అదే RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్​లో 'iQOO 12' ప్రారంభ ధర కంటే ఎక్కువగా ఉండొచ్చు. 'iQOO 12' ప్రారంభ ధర రూ. 52,999. అయితే కంపెనీ మంగళవారం ప్రారంభించబోతున్న 'iQOO 13' స్మార్ట్​ఫోన్​పై బ్యాంక్, ప్రారంభ ఆఫర్లను ప్రకటిస్తుందని అంతా భావిస్తున్నారు.

బైక్ లవర్స్​కు గుడ్​న్యూస్- ఆ బైక్​పై ఏకంగా రూ.20వేలు తగ్గింపు.. ఇయర్ ఎండ్ ఆఫర్ అదిరిపోలా..!

తిప్పరా మీసం.. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సర్వం సిద్ధం!

సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అద్భుతమైన మైలేజ్.. అదిరే ఫీచర్లతో రూ.8 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details