తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ ఫోన్​ పోయినా 'డేటా' మాత్రం సేఫ్​ - ఈ నయా ఫీచర్​ను ఎనేబుల్ చేసుకోండిలా!​ - iphone new features

Iphone Stolen Device Protection : మీ ఐఫోన్​ను ఎవరో దొంగిలించారా? దానిలో చాలా ఇంపార్టెంట్​ డేటా ఉందా? ఇలాంటి ఇబ్బందులను తప్పించడానికే యాపిల్ కంపెనీ తమ యూజర్ల కోసం స్టోలెన్ డివైజ్​ ప్రొటక్షన్​ అనే సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. మరి దానిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా?

apple phone Stolen Device Protection
Iphone Stolen Device Protection

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 3:59 PM IST

Iphone Stolen Device Protection : ఐఫోన్​ అంటేనే భద్రతకు మారుపేరు. అందుకే రేటు ఎక్కువగా ఉన్నా సరే ఐఫోన్​ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడతారు. అందుకే యాపిల్ కంపెనీ ఐఫోన్ భద్రతను మరింత రెట్టింపు చేస్తూ, ఇటీవలే iOS 17.3 సాఫ్ట్​వేర్ అప్​డేట్​ తీసుకొచ్చింది. ఇందులో​ 'స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్' ఫీచర్​ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఒక వేళ మీ ఐఫోన్​ను ఎవరైనా దొంగిలించినా, మీ ఫోన్​లోని డేటాను వారు యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. ఫలితంగా మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలుగకుండా ఉంటుంది.

పాస్​వర్డ్ తెలిసినా ఉపయోగించలేరు
ఐఫోన్​లో స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్​ ఆన్​ చేసుకుంటే, ఐఫోన్​ మీ ఇల్లు, కార్యాలయాలను ఎప్పటికప్పుడు ట్రాక్​ చేస్తుంటుంది. ఒకవేళ ఎవరైనా మీ ఫోన్​ను దొంగిలిస్తే, వాళ్లు దానిని తెరవడానికి ఫేస్​ఐడీ లేదా టచ్​ ఐడీ స్కాన్​ తప్పనిసరి ఉపయోగించాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్లకు పాస్​వర్డ్ తెలిసినా మీ డేటాను యాక్సెస్​ చేయలేరు.

అలాగే దొంగిలించిన వ్యక్తి, మీ​ యాపిల్ ఐడీని మార్చాలనుకున్పపుడు దాదాపు గంట సేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఫేస్​ ఐడీ, టచ్​ ఐడీ ఇవాల్సి ఉంటుంది. దీని వల్ల డేటా యాక్సెస్​ చేయటం లేదా పాస్​వర్డ్ మార్చటం లాంటివి చేయలేరు.

ఎక్​ట్రా వెరిఫికేషన్
మన ఐఫోన్​లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలంటే లేదా ఏదైనా డేటాను యాక్సెస్​ చేయాలనుకున్నా, ఎక్స్​ట్రా వెరిఫికేషన్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు సఫారీలో సేవ్​ చేసుకున్న పాస్​వర్డ్స్, నగదు చెల్లింపులు సమాచారన్ని యాక్సెస్​ చేయటం, లాస్ట్​ మోడ్​ను ఆఫ్​ చేయడం, కొత్త యాపిల్​ డివైజ్​ను సెట్ చేయడానికి ఫోన్​ని ఉపయోగించటం, కొత్త యాపిల్ కార్డ్ కోసం దరఖాస్తు చేయటం, అలానే యాపిల్ కార్డ్ నంబర్​ను చూడటం లాంటి వాటి కోసం అదనపు వెరిఫికేషన్ అవసరం అవుతుంది. దీని వల్ల యాపిల్ ఐడీ, పాస్​వర్డ్​ని మార్చుకోవటం లేదా యాపిల్ ఐడీ అకౌంట్​ సైన్అవుట్ చేయడం కష్టమవుతుంది. దీంతో మీ ఐఫోన్​ దొంగతనానికి గురైనా, డేటా మాత్రం సురక్షితంగా ఉంటుంది.

స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ ఎలా ఆన్​ చేసుకోవాలి
ఫోన్లో స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ ఫీచర్​ను ఆన్​ చేసుకోవాలంటే, టూ ఫ్యాక్టర్ అథంటికేషన్​ను ఆన్​ చేసి ఉంచుకోవాలి. తరువాత డివైజ్ పాస్​కోడ్​ను ఎంటర్ చేయాలి. తరువాత ఫేస్​ ఐడీ లేదా టచ్ ఐడీ ఎంటర్ చేయాలి. తరువాత Find Myలోకి వెళ్లి Significant Locations (Location Services)ను ఎనేబుల్ చేసుకోవాలి. తరువాత స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్​ ఆన్​ చేసుకోవాలి.

గోల్డెన్ ఛాన్స్​ - ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్​లో ఇన్వెస్ట్​ చేస్తే మీ డబ్బులు డబుల్​!

మీ లైఫ్​ స్టైల్​కు - ఏ క్రెడిట్ కార్డు మంచిదో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details