Indian Railways Super App:రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్న్యూస్. ఇకపై అన్ని రకాల సదుపాయాలూ ఒకే చోట ఉండేలా ఇండియన్ రైల్వే సరికొత్త యాప్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఒకే యాప్లో టికెట్ బుకింగ్, లైవ్ లొకేషన్, ఫుడ్ సైతం బుక్ చేసుకునే వెసులు బాటు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం రైల్వేకు సంబంధించి వివిధ సర్వీసుల కోసం వేర్వేరు యాప్స్, వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, అన్ రిజర్వుడు టికెట్ల కోసం యూటీఎస్ యాప్, ఫుడ్ ఆర్డర్ కోసం ఐఆర్సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ కోసం రైల్ మదద్ వంటి యాప్స్ ఉన్నాయి. ఇదికాకుండా రైల్వే ప్రయాణ స్థితిని తెలుసుకోవడానికి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉంది.
అయితే ఒక్కోదానికి ఇలా ఒక్కో యాప్లను ఉపయోగించాల్సి రావడంతో రైల్వే ప్రయాణికులు ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ సరికొత్తగా సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలుస్తోంది. టికెట్ బుక్కింగ్, పీఎన్ ఆర్ స్టేటస్, ట్రాకింగ్ సిస్టమ్ వంటి వేర్వేరుగా ఉన్న సేవలన్నీ ఈ సూపర్ యాప్ ద్వారా ఒకచోట చేర్చనున్నట్లు ఓ రైల్వే అధికారి వెల్లడించారు.