ETV Bharat / state

ఇందూరు ప్రజలకు సంక్రాంతి కానుక - నెరవేరిన చిరకాల వాంఛ - TURMERIC BOARD IN NIZAMABAD

ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం - ఇవాళ వర్చువల్‌గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్‌ - బోర్డు ఛైర్మన్‌గా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి నియామకం

Turmeric Board in Telangana 2025
Turmeric Board in Nizamabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 8:42 AM IST

Turmeric Board in Nizamabad : నిజామాబాద్‌ జిల్లా రైతుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. జాతీయ పసుపు బోర్డును ఇందూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ వర్చువల్‌గా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు.

పసుపుబోర్డు ప్రారంభం : నిజామాబాద్‌ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబరు 4న కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది.

మంత్రి పీయూష్‌ గోయల్‌ : ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. రైతుల పండుగ సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్‌ కేంద్రంగా ఇవాళ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించబోతున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రకటించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న రీజినల్‌ స్పైస్‌ బోర్డు కార్యాలయంలోనే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అర్వింద్‌ తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్‌ పేపర్‌పై రాసిచ్చారు. ఎన్నికల్లో గెలుపొందినా బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో రైతుల పోరాటం సాకారమైంది. రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ప్రారంభిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి : తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించారు. అంకాపూర్‌లోని రైతు కుటుంబంలో పుట్టిన గంగారెడ్డి, తొలుత ఆర్ఆర్ఎస్​లో పని చేశారు. అంచెలంచెలుగా ఎదిగి, 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ మత రాజకీయాలు చేసినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇచ్చారు : ఎంపీ అర్వింద్ - MP Arvind about Congress

విజన్ డాక్యుమెంట్​ పేరుతో ధర్మపురి అర్వింద్ స్థానిక మేనిఫెస్టో - 'గతంలో పసుపు బోర్డు, ఇప్పుడు ఉద్యోగాల కల్పనే లక్ష్యం' - Mp Arvind Release Local Manifesto

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.