ETV Bharat / entertainment

'RC 16' సెట్స్​లోకి రామ్‌ చరణ్‌! - ఆ స్టార్స్​తో నయా షెడ్యూల్​ - షూటింగ్ ఎప్పుడంటే? - RC 16 SHOOTING UPDATE

'RC 16' నయా షెడ్యూల్​ - ఆ స్టార్స్​తో సెట్స్​లోకి చరణ్‌! - షూటింగ్ ఎప్పుడంటే?

RC 16 Shooting Update
Ram Charan Janhvi Kapoor Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2025, 10:38 AM IST

RC 16 Shooting Update : 'గేమ్​ ఛేంజర్' అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మరో సాలిడ్ ప్రాజెక్ట్​తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆర్‌సీ 16' అనే వర్కింగ్ టైటిల్​తో రానున్న సినిమాపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. 'ఉప్పెన' ఫేమ్​ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ షూటింగ్​లో ఆయన పాల్గొననున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్​ బుధవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఇది జరగనుంది. రాత్రి వేళలో సాగే ఈ షెడ్యూల్‌లో చెర్రీతో పాటు మరికొందరు కీ స్టార్స్ పాల్గొననున్నారట. వారందరిపై సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ నయా షెడ్యూల్​ కోసం ఓ స్పెషల్ సెట్‌ను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల మాట. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలు ఉండనున్నాయని, ఇది పూర్తిగా ఉత్తరాంధ్ర బ్యాక్​డ్రాప్​లో సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం 'పెద్ది' అనే పేరును ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ ఫీమేల్​ లీడ్​గా మెరవనుండగా, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మ్యూజికల్​ సెన్సేషన్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దీనికి ఛాయాగ్రాహక బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలతో కలిసి వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక చెర్రీ రీసెంట్ మూవీ 'గేమ్​ ఛేంజర్'​ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ మిక్స్​డ్ టాక్​తో సరిపెట్టుకుంది. డ్యూయెల్​ రోల్​లో చెర్రీ తనదైన శైలిలో నటించి మెప్పించినప్పటికీ, ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచిందని అభిమానులు అంటున్నారు. అయితే అప్పన్న క్యారెక్టర్​కు మాత్రం వారందరూ బాగా కనెక్ట్ అయ్యారని కామెంట్ చేస్తున్నారు.

పోలీస్‌ బెల్టుతో నాన్న చితకబాదారు!: రామ్ చరణ్ - Chiranjeevi Ramcharan

RC 16 సూపర్ అప్డేట్​ ఇచ్చిన ఏఆర్​ రెహమాన్!​ - ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.