Hyundai Tucson Crash Test Rating: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌కి చెందిన ఎస్యూవీ టక్సన్ ఫ్రైవ్ స్టార్ క్లబ్‌లోకి చేరింది. భారత్ ఎన్సీఏపీ క్రాస్ టెస్ట్‌లో ఈ ఎస్యూవీ పర్ఫెక్ట్ 5-స్టార్ రేటింగ్ సాధించింది. భారత్ ఎన్సీఏపీ పరీక్షించిన తొలి హ్యుందాయ్ కారు ఇదే. గతంలో ఈ కంపెనీకి చెందిన వెర్నా గ్లోబల్ ఎన్సీఏపీ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పుడు టక్సన్ అత్యధిక రేటింగ్ సాధించింది.
అడల్ట్ సెక్యూరిటీకి సంబంధించి 32 పాయింట్లకు గానూ ఈ కారు 30.84 పాయింట్లు సాధించింది. ఇక చైల్డ్ ప్రొటెక్షన్‌కు సంబంధించి 49 పాయింట్లకు గాను 41 పాయింట్లు పొందింది. ఈ రెండు కేటగిరీల్లోనూ హ్యుందాయ్ టక్సన్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించినట్లు భారత్ ఎన్సీఏపీ వెల్లడించింది. ఈ సందర్భంగా హ్యుందాయ్ టక్సన్ ఎస్యూవీ ఇంజిన్, భద్రతా ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండియ
ఇంజిన్:ఇది 2.0-లీటర్ పెట్రోల్, 2-లీటర్ డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. దీని పెట్రోల్ ఇంజిన్ 156bhp పవర్, 192Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లింక్ అయి ఉంటుంది. ఇక దీని డీజిల్ ఇంజిన్ 186bhp పవర్, 416Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతయి వస్తుంది. అంతేకాకుండా టక్సన్ డీజిల్ ఇంజిన్‌కు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది.
సెక్యూరిటీ ఫీచర్స్:
- ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్
- బెల్ట్ ప్రీటెన్షనర్
- బెల్ట్ లోడ్ లిమిటర్
- సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్
- సైడ్ చెస్ట్ ఎయిర్ బ్యాగ్
- సైడ్ పెల్విస్ ఎయిర్ బ్యాగ్