తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ ఫోన్ స్లో అయిపోయిందా? నో ప్రాబ్లమ్.. ఇలా చేస్తే 'డబుల్ స్పీడ్​'తో పనిచేస్తుంది!​ - HOW TO SPEED UP SLOW ANDROID PHONE

How to Speed Up Slow Android Phone: మీ స్మార్ట్​ ఫోన్ బాగా స్లో అయిపోయిందా? మొబైల్ కొత్తదానిలా స్పీడ్​గా పనిచేసే మార్గాల కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. ఈ సింపుల్ టిప్స్​తో మీ ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు. అవేంటంటే?

How_to_Speed_Up_Slow_Android_Phone
How_to_Speed_Up_Slow_Android_Phone (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Sep 2, 2024, 3:34 PM IST

How to Speed Up Slow Android Phone: ఇటీవల కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి దగ్గరా స్మార్ట్​​ ఫోన్లు ఉంటున్నాయి. వాటిలో ఆండ్రాయిడ్ మొబైల్స్​ను ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ లేకుంటే అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో ఉండాల్సిందే. అంతలా దానిపై ఆధారపడిన సమయంలో ఫోన్ స్లో అయిపోయి సరిగా పనిచేయకపోతే చాలా చికాకుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేస్తే మళ్లీ మొబైల్​ ఫోన్ స్పీడ్​గా పనిచేస్తుంది? అని వెతుకుతున్నవారు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మొబైల్ కొత్తదానిలా స్పీడ్​గా పనిచేస్తుంది.

ఫోన్ స్పీడ్​గా పనిచేసేందుకు టిప్స్​:

ఫోన్ రీస్టార్ట్: ఫోన్​ను ఎక్కువగా ఉపయోగించటం వల్ల అది స్లో అయిపోతుంది. దాని పనితీరులో కూడా అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో ఫోన్​ను రీస్టార్ట్​ చేయాలి. దీనివల్ల RAM క్లియర్ అవుతుంది. దీంతోపాటు మొబైల్​ ఫోన్​లో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి.

ఫోన్​లో యాప్స్ స్టోరేజీ​ తగ్గించుకోవాలి:తరచూ కొత్త కొత్త యాప్​లను ఇన్​స్టాల్​ చేయటం వల్ల కూడా మొబైల్ స్లో అయిపోతుంది. కాబట్టి పనికొచ్చే యాప్స్​ మాత్రమే ఫోన్​లో ఉంచి అనవసరమైన యాప్స్​ను అన్​ఇన్​స్టాల్​ చేసేసుకోండి. దీంతోపాటు Facebook, Instagram వంటి యాప్స్​కి సంబంధించిన లైట్​ వెర్షన్​లను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్పీడ్ మెరుగుపడుతుంది.

మొబైల్​లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్:స్మార్ట్​ ఫోన్​లో సాఫ్ట్​వేర్ అప్​గ్రేడ్​ చేయకపోవటం వల్ల కూడా మొబైల్ స్లో అయిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు సాఫ్ట్​వేర్​ అప్​డేట్​గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మీ ఫోన్​ కొత్తదానిలా స్పీడ్​గా పనిచేస్తుంది.

యానిమేషన్ అడ్జెస్ట్మెంట్:స్మార్ట్​ ఫోన్​లో యానిమేషన్స్​ను తగ్గించటం లేదా నిలిపివేయటం వల్ల ఫోన్​ స్పీడ్​ను మెరుగుపరచుకోవచ్చు. ఫోన్ స్పీడ్​గా పనిచేయాలంటే 'Animator Duration Scale', 'Transition Animation Scale', 'Window Animation Scale' సెట్టింగ్స్​ను '5X' లేదా 'ఆఫ్' మోడ్​కి మార్చండి.

ఈ-మెయిల్ పొరపాటున సెండ్ చేశారా?- డోంట్ వర్రీ.. ఇలా చేస్తే అన్​సెండ్​ చేసేయొచ్చు! - How to Unsend Email in Gmail

మొదటిసారి కారు కొంటున్నారా?- నో టెన్షన్ గురూ.. వీటితో ఫుల్ క్లారిటీ! - Top Trending Cars With Low Budget

ABOUT THE AUTHOR

...view details