How To Protect Wifi From Hackers :పెరుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకొని మన వ్యక్తిగత డేటాను చోరీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మనం వాడుతున్న వైర్లెస్ వైఫైను కూడా హ్యాక్ చేసి మన పర్సనల్ డేటా మొత్తాన్ని అపహరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో సైబర్ మాయగాళ్ల వలలో పడకుండా, మన వైఫైను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
లాగిన్ వివరాలను మార్చుకోవడం
వైఫై రూటర్ ఇన్‌స్టాలేషన్‌తో వచ్చే డీఫాల్ట్ లాగిన్ వివరాలను వెంటనే మార్చుకోవాలి. లేదంటే హ్యాకర్లు చాలా సులువుగా మీ రూటర్‌లోని డేటాను చోరీ చేసే అవకాశం ఉంది.
తరచుగా వైఫై పాస్వర్డ్లు మార్చడం
మీ రూటర్ భద్రతంతా వైఫై పాస్వర్డ్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తరచుగా మీ వైఫై పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవాలి. ఎనిమిది అక్షరాలు లేదా అంతకంటే పెద్ద అల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. అలాగే 'రూటర్ పేరు' కూడా మార్చాలి. దీని వల్ల హ్యాకర్స్‌కు మీ వైఫైను హ్యాక్ చేయడం కష్టంగా మారుతుంది.
యాక్సెస్‌ను షేర్ చేయవద్దు
మీ ఇంట్లో వైఫై ఉంటే జాగ్రత్తగా ఉండాలి. పొరుగువారికి పాస్వర్డ్ తెలిస్తే వారు, దానిని వాడేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వైఫై పాస్‌వర్డ్‌ను పక్కింటివారికి చెబితే, ఆ పని పూర్తయిన తరువాత సదరు పాస్‌వర్డ్‌ను మార్చుకోడవం బెటర్. సాధారణంగా వైఫై రూటర్లలో డిఫాల్ట్‌గా రిమోట్ యాక్సెస్ ఎనేబుల్ అయ్యుంటుంది. మీరు కనుక దానిని ఉపయోగించకపోతే, వెంటనే దానిని నిలిపివేయడం మంచిది.