తెలంగాణ

telangana

ETV Bharat / technology

ల్యాప్​టాప్ బయ్యింగ్ టిప్స్ - గ్రాఫిక్స్ కార్డ్​ మస్టా? ఆన్​లైన్​ కొంటే బెటరా? లేదా ఆఫ్​లైన్​లోనా? - HOW TO CHOOSE THE RIGHT LAPTOP

ల్యాప్​టాప్ కొనేటప్పుడు ఏయే స్పెసిఫికేషన్స్ చూడాలి? ఎలాంటి హార్డ్​వేర్స్ కొనాలి?​

Laptop Buying Tips
Laptop Buying Tips (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 5:07 PM IST

How To Choose The Right Laptop : మార్కెట్లో చాలా బ్రాండెడ్ ల్యాప్​టాప్స్ ఉంటాయి. కానీ వాటిలో మీ అవసరాలను తీర్చే సరైన ల్యాప్​టాప్​ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి ఈ విషయంలో కన్​ఫ్యూజన్​ ఉంటుంది. ఎలాంటి ల్యాప్​టాప్​ కొనాలి? వాటిలో ఏయే కాంపోనెంట్స్ ఉండేలా చూసుకోవాలి? అనేది తెలియక ఇబ్బందిపడుతూ ఉంటారు. అందుకే ఈ ఆర్టికల్​లో సరైన ల్యాప్​టాప్​ను ఏ విధంగా ఎంచుకోవాలో తెలుసుకుందాం.​

How To Choose The Right Laptop?

1. ఆపరేటింగ్ సిస్టమ్​ : ల్యాప్​టాప్​ కొనేటప్పుడు ముందుగా 'ఆపరేటింగ్ సిస్టమ్' గురించి ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఏ సాఫ్ట్​వేర్​ను రన్ చేయాలని అనుకుంటున్నారో, దానికి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ఆపరేటింగ్ సిస్టమ్​ను బట్టి, దానికి కంపాటిబిలిటీ ఉన్న హార్డ్​వేర్​ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 4 ప్రధానమైన కంప్యూటర్​ ఆపరేటింగ్ సిస్టమ్​లు ఉన్నాయి. అవి దేనికి పనికి వస్తాయి? దేనికి పనికిరావు? అనేది ఇప్పుడు చూద్దాం.

  • విండోస్​ (Window) :ఇందులో ఎంఎస్​ ఆఫీస్​, అవుట్​లుక్ వంటి మైక్రోసాఫ్ట్​ యాప్స్ అన్నీ చక్కగా రన్ అవుతాయి. అంతేకాదు వీడియో ఎడిటింగ్, గేమింగ్​, కోడింగ్ లాంటి వాటికి ఉపయోగపడే థర్డ్ పార్టీ యాప్స్​ను లేదా సాఫ్ట్​వేర్స్​ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.​ వాస్తవానికి దీనిలో ఎలాంటి సాఫ్ట్​వేర్లు అయినా రన్ చేసుకోవచ్చు.
  • మ్యాక్ ఓఎస్​ (macOS) : ఇది చాలా స్మూత్​గా రన్ అవుతుంది. కానీ విండోస్​ లాగా దీనిలో ఏ సాఫ్ట్​వేర్ పడితే దానిని ఇన్​స్టాల్ చేయలేము. కేవలం యాపిల్ కంపెనీకి చెందిన సాఫ్ట్​వేర్స్ మాత్రమే దీనిలో రన్​ అవుతాయి. అంతేకాదు యాపిల్ కంపెనీ హార్డ్​వేర్స్ మాత్రమే దీనికి సపోర్ట్ చేస్తాయి.
  • క్రోమ్ ఓఎస్​ (Chrome Os) : వెబ్​బ్రౌజింగ్ చేసేవారికి మాత్రమే ఇది బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో లిమిటెడ్ టాస్క్​లు చేసేవారికి ఇది బాగానే ఉంటుంది. కానీ దీనిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్​, అడోబ్​ క్రియేటివ్​ సూట్​ సరిగ్గా రన్​ కావు.
  • లీనక్స్​ (Linux) :ఇది కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్​, అడోబ్ క్రియేటివ్ సూట్​లకు సపోర్ట్ చేయదు. కానీ లిబ్రే ఆఫీస్ (ఎంఎస్​ ఆఫీస్​కు ఆల్టర్నేటివ్​), డార్క్​టేబుల్ (అడోబ్​ లైట్​రూమ్​కు ఆల్టర్నేటివ్​), గింప్ (అడోబ్​ ఫొటోషాప్​నకు ఆల్టర్నేటివ్​)​ లాంటి వాటిని దీనిలో వాడుకోవచ్చు.

2. ప్రాసెసర్​ (CPUs) : ల్యాప్​టాప్​ కొనాలని అనుకునేవారు ఆపరేటింగ్ సిస్టమ్ తరువాత ఆలోచించాల్సింది హార్డ్​వేర్ స్పెసిఫికేషన్స్ గురించి. వీటిలో అత్యంత ప్రధానమైనది ప్రాసెసర్​. దీనినే సింపుల్​గా సీపీయూ లేదా చిప్ అని అంటూ ఉంటారు. వీటి ఆధారంగా సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇంటెల్​, ఏఎండీ, ఏఆర్​ఎం, యాపిల్ ప్రాసెసర్లు ఉన్నాయి.

  • Intel ప్రాసెసర్స్​ : ఇంటెల్ కంపెనీ ప్రాసెసర్ల విషయానికి వస్తే - కోర్​ i3, కోర్​ i5, కోర్​ i7, కోర్​ i9 ఉన్నాయి. వీటిలో కోర్​ i3 తక్కువ శక్తివంతమైనది కాగా, కోర్​ i9 చాలా పవర్​ఫుల్​ది. ఈ చిప్​ల సామర్థ్యాని బట్టే మీ ల్యాప్​టాప్ పెర్ఫార్మెన్స్​ ఆధారపడి ఉంటుంది. కనుక వీలైనంత ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రాసెసర్​ తీసుకోవడమే మంచిది. ఈ ఇంటెల్ చిప్​లపై Y, U, H, HY లాంటి అక్షరాలు ఉంటాయి. వీటి ఆధారంగా అవి దేనికి ఉపయోగపడతాయో తెలుస్తుంది. ఎలా అంటే? Y సిరీస్ ఉన్న చిప్​లు ఉంటే, ఆ ల్యాప్​టాప్​ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ సేపు ల్యాప్​టాప్ ఉపయోగించేవారు ఈ Y సిరీస్​ ప్రాసెసర్ ఎంచుకోవడం మంచిది. H చిప్​లు ఉండే ల్యాప్​టాప్​ల పనితీరు చాలా బాగుంటుంది. U చిప్​లు మంచి 'పవర్​ ఎఫీషియెంట్'గా ఉంటాయి. కానీ Y చిప్​లంత సమర్థవంతమైనవి కావు. ఇక HX చిప్​లు చాలా శక్తివంతమైనవి. ఇవి ఉన్న ల్యాప్​టాప్​లు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. కానీ బ్యాటరీ లైఫ్ బాగా తగ్గుతుంది.
  • AMD ప్రాసెసర్స్​ :ఏఎండీ చిప్​లను అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు 'AMD Ryzen 5 8600X'ను తీసుకుంటే - దీనిలో 8 అనేది జనరేషన్​ను తెలుపుతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది. 6 అనేది ఇది ఎంత పవర్​ఫుల్​గా ఉంటుందో తెలియజేస్తుంది. తరువాత ఉన్న నంబర్లకు ఎలాంటి ప్రత్యేకత లేదు. కానీ చివరిలో ఉన్న X అనేది దీని హై పెర్ఫార్మెన్స్​ను తెలుపుతుంది.
  • వీడియో ఎడిటింగ్​, గేమింగ్​ల కోసం ల్యాప్​టాప్ కొనాలని అనుకునేవారు, ఇంటెల్ చిప్​ల కంటే, ఏఎండీ ప్రాసెసర్​లను ఎంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఇంటిగ్రేటెడ్​ గ్రాఫిక్స్​కు బాగా సపోర్ట్ చేస్తాయి. కానీ హెవీ గేమ్స్ ఆడాలంటే మాత్రం డెడికేటెడ్​ గ్రాఫిక్స్​ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది.
  • యాపిల్ ప్రాసెసర్స్​ : యాపిల్ కంపెనీ తమ మ్యాక్​బుక్​, ఐపాడ్​, ఐఫోన్ల కోసం ప్రత్యేకంగా చిప్స్​ తయారు చేస్తుంది. వీటిలో ప్రధానంగా M1, M2, M3 చిప్స్ ఉంటాయి. వీటిలో M1 అనేది చాలా పాతది, ఇది స్లోగా పనిచేస్తుంది. M3 చిప్ లేటెస్ట్​ది, ఇది చాలా ఫాస్ట్​గా పనిచేస్తుంది. ఈ చిప్​లలో కూడా బేస్ మోడల్​, ప్రో, మ్యాక్స్, ఆల్ట్రా మొదలైన డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వీటిలో 'ఆల్ట్రా' అనేది మోస్ట్ పవర్​ఫుల్​గా ఉంటుంది.
  • ARM ప్రాసెసర్స్​ : ఇది మైక్రోసాఫ్​ కోపైలెట్​+ఏఐలకు సపోర్ట్ చేస్తుంది. దీని పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్​ బాగుంటుంది. ఈ క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ ఎక్స్ సీపీయూ మైక్రోసాఫ్ట్ యాప్స్ వాడేవారికి బాగా ఉపయోగపడుతుంది.

3. గ్రాఫిక్స్ కార్డ్ : మీ ల్యాప్​టాప్​లో హెచ్​డీ వీడియోలు చూడాలన్నా, పవర్​ఫుల్ గేమ్స్​ ఆడాలన్నా, లేదా హెవీ వీడియో ఎడిటింగ్​ సాఫ్ట్​వేర్స్ రన్ చేయాలన్నా, కచ్చితంగా మంచి డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉండాల్సిందే. ఏఎండీ, ఎన్​వీడియో గ్రాఫిక్స్ కార్డులు ప్రస్తుతం మంచి ప్రాచుర్యంలో ఉన్నాయి.

సాధారణంగా ఇంటెల్ బేస్డ్​ ల్యాప్​టాప్​ల్లో ఎన్వీడియా గ్రాఫిక్స్ కార్డులు ఉంటాయి. వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఇక ఏఎండీ - జీపీయూ లైన్​ను​ 'రేడియాన్​' అని పిలుస్తారు. వీటిలో RX కార్డుల నుంచి R సిరీస్​ కార్డుల వరకు ఉంటాయి. రేడియన్​ R5 సిరీస్​ కంటే R9 సిరీస్ అత్యంత శక్తివంతంగా ఉంటుంది.

4. ర్యామ్ :ర్యాండమ్ యాక్సెస్ మెమరీనే (RAM) అని సింపుల్​గా అంటారు. మీరు ల్యాప్​టాప్​ పనిచేస్తున్నప్పుడు ఈ ర్యామ్ -​ డేటాను హోల్డ్ చేసి ఉంచుతుంది. ఎలా అంటే? ఉదాహరణకు మీ డెస్క్ మీద చాలా వస్తువులు ఉన్నాయనుకోండి. ఇంకొకటి దానిపై ఉంచితే అవి పడిపోతాయి. ఎందుకంటే అక్కడ కావాల్సినంత స్థలం లేదు. అదే విధంగా ర్యామ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ టాస్క్​లు చేయడానికి వీలవుతుంది. లేకుండా ఎక్కువ టాస్క్​లు ఒకేసారి చేయడానికి వీలుపడదు. పైగా సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది లేదా స్లో అయిపోతుంది.

సాధారణంగా ల్యాప్​టాప్​ల్లో 2జీబీ, 4జీబీ, 8జీబీ, 16జీబీ, 32జీబీ ర్యామ్​లు ఉంటాయి. ప్రోగ్రామింగ్ సాఫ్ట్​వేర్లు, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్​వేర్లు, కంపైలింగ్ సాఫ్ట్​వేర్లు వాడాలంటే కచ్చితంగా 16జీబీ లేదా 32జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోవడం మంచిది. మార్కెట్లో DDR3, DDR4, DDR5 ర్యామ్​లు ఉన్నాయి. వీటిలో DDR5 చాలా శక్తివంతమైనది. గేమింగ్ చేసేవాళ్లు కచ్చితంగా DDR5 తీసుకోవడమే బెటర్​.

5. స్టోరేజ్ : ల్యాప్​టాప్​లో మీ డేటా మొత్తాన్ని స్టోర్ చేయడానికి కచ్చితంగా మంచి హార్డ్ డ్రైవ్ ఉండాలి. ఇందుకోసం చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ SSD డ్రైవ్​లు వాడుతుంటారు. అయితే ఇది కనీసం 256జీబీ, 512 జీబీ నుంచి 1టీబీ వరకు ఉండేలా చూసుకోవడం మంచిది. అప్పుడే ఎక్కువ మొత్తం ఫైల్స్, వీడియోస్, ఫొటోస్​, సాఫ్ట్​వేర్స్​ లాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది.

6. స్క్రీన్ : ల్యాప్​టాప్​ కొనేముందు స్క్రీన్​ సైజును కూడా కచ్చితంగా చూసుకోవాలి. సాధారణంగా తక్కువ బడ్జెట్లో 13, 15 అంగుళాల ల్యాప్​టాప్​లు అందుబాటులో ఉంటాయి. కానీ ల్యాప్​టాప్ స్క్రీన్ వీలైనంత పెద్దగా ఉండేలా చూసుకోవడం మంచిది. అప్పుడే మీ కంటికి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. 4కె, ఫుల్​ హెచ్​డీ వీడియోలు చూడడానికి, అలాగే కోడింగ్ రాసుకోవడానికి, ఫైల్స్ చదవడానికి అనువుగా ఉంటుంది.

7. పోర్ట్స్​ : ల్యాప్​టాప్ కొనేటప్పుడు దానిలో అన్ని రకాల పోర్ట్స్ ఉండేలా చూసుకోవాలి. యూఎస్​బీ డివైజ్​లను కనెక్ట్ చేసుకోవడానికి, ఛార్జింగ్ కేబుల్స్ పెట్టుకోవడానికి వీలుగా పోర్టులు ఉండాలి. ముఖ్యంగా యూఎస్​బీ-సీ, సీఎస్​బీ-ఏ పోర్టులు, మైక్రోఫోన్/హెడ్​సెట్ జాక్​ ఉండాలి. అలాగే మీ ల్యాప్​టాప్​లో ఎస్​డీ, మైక్రోఎస్​డీ కార్డ్ రీడర్​ ఉండాలా చూసుకోవాలి. లేదంటే ప్రత్యేకంగా కార్డ్ రీడర్లను తీసుకోవాల్సి ఉంటుంది. వీలైతే థండర్​బోల్ట్​ పోర్ట్స్ ఉండేలా చూసుకోవడం మంచిది.

8. వెబ్​క్యామ్​ : లేటెస్ట్ ల్యాప్​టాప్​ల్లో కచ్చితంగా వెబ్​క్యామ్​లు ఉంటున్నాయి. కనుక మీ ల్యాప్​టాప్​లో కనీసం 720p, హెచ్​డీ, 4కె వెబ్​క్యామ్​ ఉండేలా చూసుకోవడం మంచిది.

9. ఎక్కడ కొనాలి : సాధారణంగా అఫీషియల్ వెబ్​సైట్లలో ల్యాప్​టాప్​లను కొంటూ ఉంటాం. కానీ వీటిలో రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్న సమయంలో అమెజాన్​, ఫ్లిప్​కార్డ్​ లాంటి ఈ-కామర్స్ వెబ్​సైట్లలో వీటిని కొనుగోలు చేయడం మంచిది. లేదా మంచి రిటైలర్ల వద్ద కూడా ల్యాప్​టాప్ తీసుకోవచ్చు. రిటైల్ షాపుల్లో ల్యాప్​టాప్ తీసుకుంటే, వాళ్లు ఉచితంగా కొన్ని యాక్సెసరీస్​ కూడా అందిస్తారు. దీని వల్ల మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది.

మీ ల్యాప్​టాప్​ 'బ్యాటరీ హెల్త్' చెక్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Check Laptop Battery Health

ఫోన్ యూజర్స్​ అందరికీ ఉపయోగపడే​ - ఈ టాప్ 8​ టిప్స్ & ట్రిక్స్ ఇవే! - Useful Phone Tricks

ABOUT THE AUTHOR

...view details