How To Boost Android Phone Battery Life : నిరంతరాయంగా ఫోన్‌ను ఉపయోగించడం వల్ల, సహజంగానే బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అయిపోతుంది. దీంతో ఫోన్‌కు పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. దీని వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే మన ఫోన్లోని కొన్ని సెట్టింగ్స్ కూడా బ్యాటరీ లైఫ్‌ను తగ్గించేస్తాయి. అందుకే ఇలాంటి సమస్య రాకుండా, ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచే, టాప్-10 సెట్టింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అవసరం లేనప్పుడు డిస్ప్లేను ఆఫ్‌లో ఉంచండి
అవసరం అయినప్పుడు తప్ప మీ ఆండ్రాయిడ్ ఫోన్ డిస్ప్లేను ఆఫ్‌లో ఉంచడమే మంచిది. ఎందుకంటే, డిస్ప్లే ఆన్‌లో ఉంచడం వల్ల గంటకు 1-2 శాతం వరకు ఛార్జింగ్ తగ్గిపోతుందని కంపెనీలు చెబుతుంటాయి. కానీ వాస్తవంలో ఇంత కంటే ఎక్కువగానే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుంది. అందుకే మీ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకునేందుకు డిస్ప్లేను ఆఫ్‌లో ఉంచడం మంచిది. ఇందుకోసం సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి settings > Lock Screen > always show info> Always On Display ఆప్షన్‌పై క్లిక్ చేసి, దానిని టర్న్ఆఫ్ చేయాలి.
2. ఎనేబుల్ అడాప్టివ్ బ్యాటరీ
మీ ఫోన్లో 'అడాప్టివ్ బ్యాటరీ' అనే ఫీచర్ ఉంటుంది. దీనిని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేసి Settings > Battery > Adaptive battery అనే ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
3. డార్క్‌మోడ్‌ను ఉపయోగించడం
మీ ఫోన్లో OLED డిస్ప్లే ఉంటే, డార్క్‌మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవడం మంచిది. దీని వల్ల బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ డిస్ప్లే పిక్సెల్స్‌ను, బ్యాగ్రౌండ్‌ను కాస్త డిమ్ చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి, Settings > Display > డార్క్‌మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
4. బ్రైట్నెస్ తగ్గించాలి!
ఫోన్ బ్రైట్నెస్ను తగ్గించడం వల్ల కూడా బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. అలాగే Screen timeoutను కూడా ఎనేబుల్ చేసుకోవాలి.
5. అనవసర అకౌంట్లను తీసేయండి
సాధారణంగా మనం ఒక ఈ-మెయిల్ అకౌంట్‌తో ఫోన్లో లాగిన్ అవుతాం. అయితే సోషల్ మీడియా యాప్‌ల కోసం, బ్యాకప్ కోసం మరిన్ని ఈ-మెయిల్ అకౌంట్స్‌ను కూడా యాడ్ చేసుకుంటాం. దీని వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. ఎలా అంటే? మీరు సెర్చ్ చేసే సమాచారాన్ని వివిధ మెయిల్స్ మధ్య సింక్రనైజ్ చేయడానికి ఫోన్ ప్రతిసారీ రీఫ్రెష్ అవుతుంది. దీని వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అందుకే మీ ఫోన్లో ఒకటి లేదా రెండు ఈ-మెయిల్స్ మాత్రమే వాడాలి. మిగతావాటిని రిమూవ్ చేయాలి.
6. కీబోర్డ్ సౌండ్‌ను ఆఫ్ చేయండి
ఫోన్లో మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు సహజంగానే సౌండ్ వస్తుంది. దీని వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అందుకే ఈ సౌండ్స్‌ను, హాప్టిక్స్ను టర్న్ఆఫ్ చేయాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి Settings > Language and input > keyboard settings> Preferences> Sound on keypress, Haptic feedback on keypressను డిజేబుల్ చేయాలి.