Honda CB300F Flex-Fuel Launched:దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ను హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లాంచ్ చేసింది. హోండా CB300F పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త హోండా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ బుకింగ్స్ మార్కెట్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. అక్టోబర్ చివరి వారం నుంచి హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో ఈ బైక్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా ఇంతకీ ఏంటీ ఫ్లెక్సీ ఫ్యూయల్? ఈ బైక్ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.
హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్ ఫీచర్లు:
- ఇంజిన్:293.52 cc
- టార్క్: 25.6 Nm
- కెర్బ్ వెయిట్:153 kg
- పవర్: 24.4 PS
- మైలేజ్:30 kmpl
- బ్రేక్స్:డబుల్ డిస్క్
హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్: ఈ కొత్త బైక్‌ను 293.52సీసీ, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ పీజీఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌తో తీసుకొచ్చారు. ఇది 18.3 kW పవర్, 25.9 టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 6- స్పీడ్ గేర్ బాక్స్, అసిస్టెంట్ స్లిప్ క్లచ్‌తో వస్తోంది. రెండు డిస్క్‌బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో దీన్ని తీసుకొచ్చారు.
హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్ కలర్ ఆప్షన్స్:
- స్పోర్ట్స్ రెడ్
- మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్