iQOO Neo 10R India Launch Confirmed: వివో సబ్-బ్రాండ్ కంపెనీ ఐకూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. కంపెనీ దీన్ని 'ఐకూ నియో 10R' పేరుతో తీసుకురానుంది. ఈ మేరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఐకూ ఇండియాలో త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ CEO కన్ఫార్మ్ చేశారు.
ఐకూ కొత్త ఫోన్: ఐకూ CEO నిపున్ మార్య ఈ మధ్యాహ్నం తన అధికారిక X అకౌంట్లో ఒక పోస్ట్ పంచుకున్నారు. ఆ పోస్ట్‌లో '2025లో వచ్చే మొదటి అద్భుతమైన ఐకూ ఫోన్ కోసం రెడీగా ఉన్నారా? అయితే ఇది చదవండి- ఈ ట్వీట్‌కి అది సరైనదే కావచ్చు' అని ఇంగ్లీషులో రాసుకొచ్చారు. CEO పోస్ట్ చేసిన ఈ మిస్టీరియస్ ట్వీట్లోని R లెటర్స్‌ను బోల్డ్ చేసి హైలైట్ చేశారు. అంటే ఐకూ CEO పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రకారం కంపెనీ త్వరలో భారత్‌లో 'ఐకూ నియో 10R'ను లాంఛ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అంచనా ఫీచర్లు అండ్ స్పెసిఫికేషన్లు: ఈ ఫోన్‌లో 1.5K AMOLED డిస్‌ప్లే ఇవ్వొచ్చు. దీని రిఫ్రెష్ రేట్ కూడా 144Hz ఉండొచ్చు. ఈ ఫోన్ హై-రిజల్యూషన్ డిస్‌ప్లే వినియోగదారులకు గొప్ప 4K వీడియో వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. దీంతోపాటు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సౌకర్యం కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ 6400mAh బ్యాటరీతో వస్తుందని లీక్స్ వచ్చాయి.
ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి పెద్దగా సమాచారం రివీల్ కాలేదు. అయితే మరికొన్ని వారాల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కావచ్చు. ఈ నేపథ్యంలో కంపెనీ త్వరలోనే పోస్ట్ లేదా లీక్ ద్వారా ఈ అప్‌కమింగ్ ఫోన్ వివరాలను పంచుకోవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ధర: కంపెనీ ఈ 'ఐకూ నియో 10R' స్మార్ట్‌ఫోన్‌ను రూ. 30,000 రేంజ్ ధరలో లాంఛ్ చేయొచ్చు. ఐక్యూ నియో లైనప్‌లోని మొదటి ఫోన్ 2022లో ప్రారంభించారు. అప్పటి నుంచి కంపెనీ ఈ లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్తో ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో ఐకూ తాజాగా తీసుకొస్తున్న ఈ ఫోన్ ద్వారా వినియోగదారుల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త అప్డేట్స్తో బెస్ట్ ఫ్యామిలీ స్కూటీ లాంఛ్- ధర ఎంతంటే?
చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన ఎయిర్టెల్, జియో, వీఐ!- డేటా అవసరంలేని వారికి ఇక పండగే!
అల్ట్రా-స్లిమ్, ఆకట్టుకునే డిజైన్‌తో 'గెలాక్సీ S25 ఎడ్జ్'- టీజర్ చూశారా?