Zomato CEO Deepinder Goyal: జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌కు ఎదురైన చేదు అనుభవంపై ఎక్స్‌లో చేసిన పోస్ట్‌పై మాల్ స్పందించింది. డెలివరీ స్టాఫ్ కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పికప్ పాయింట్ ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాగా విధుల్లో ఉండగా తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న ఇబ్బందులను తెలుసుకునేందుకు స్వయంగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ రంగంలోకి దిగారు.
ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకోవడానికి స్వయంగా ఆయన గురుగ్రామ్‌లోని ఒక మాల్‌లోకి వెళ్లగా.. లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కాలంటూ అక్కడి సెక్యూరిటీ స్టాఫ్ సూచించారు. దీంతో ఆయన మూడు అంతస్తులు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా మెట్ల ద్వారం వద్దే ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైందంటూ తన అనుభవాన్ని గోయల్ 'ఎక్స్'లో చేసిన పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సదరు మాల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని గోయల్‌షేర్ చేసుకున్నారు.
"డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న పరిస్థితిపై ఆ మాల్ స్పందించింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పికప్ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. నా పోస్టుపై వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు. మాల్‌లోని రెస్టారంట్ల నుంచి ఈ పికప్ పాయింట్లకు త్వరగా ఆహారాన్ని చేరవేసేందుకు కొన్ని వాకర్లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. మిగతా వారు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను." అని గోయల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. కొన్నిసార్లు డెలివరీ ఏజెంట్‌గా అవతారమెత్తే దీపిందర్ గోయల్.. వినియోదారులకు ఫుడ్ డెలివరీ చేయడాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. తన భార్యతో కలిసి ఫుడ్ డెలివరీ చేసిన దృశ్యాలను కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
ఎంఎక్స్ ప్లేయర్‌ని కొన్న అమెజాన్- ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ 'మినీటీవీ'లో విలీనం
మీ ఫోన్ చోరీకి గురైందా?- వెంటనే ఇలా స్క్రీన్ లాక్ చేసేయండి.. అన్నీ సేఫ్..! - Google Theft Protection Feature