Google To Launch Find My Device Network For Android : గూగుల్ కంపెనీ ఏప్రిల్ 7న 'ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్'ను లాంఛ్ చేయనుంది. దీనితో మీరు పోగొట్టుకున్న ఫోన్‌ను చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు. దొంగ మీ ఫోన్‌ను స్విఛ్ ఆఫ్ చేసినా సరే దానిని ట్రాక్ చేసేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఎలా పనిచేస్తుందంటే?
ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 బిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉన్నారు. వీరందరికీ గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. కనుక వాళ్లు ఫోన్ పోయినా, వాటిని దొంగలు స్విఛ్ ఆఫ్ చేసినా, చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు.
ఒకవేళ మీ డివైజ్‌లోని బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ కోల్పోతే, దాని చివరి లొకేషన్‌ను తెలియజేస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగించి, ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ మాత్రమే కాదు. దానితో పెయిర్ చేసిన ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్‌ను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆండ్రాయిడ్ ఫోన్‌తో లింక్ చేసి ఉన్న వాలెట్స్, కీస్, బైక్‌లను కూడా సులువుగా కనిపెట్టేయవచ్చు.
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం
వాస్తవానికి ఇప్పుడున్న గూగుల్ Find My Device App ఉపయోగించి, మీరు పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్లను ట్రాక్ చేసుకోవచ్చు. కానీ ఎవరైనా ఆ ఫోన్‌ను స్విఛ్ ఆఫ్ చేస్తే, ఇక దానిని కనిపెట్టడం వీలుకాదు. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 'ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్'ను ఏప్రిల్ 7న లాంఛ్ చేయనుంది. వాస్తవానికి I/O 2023 ఈవెంట్లోనే గూగుల్ ఈ 'ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్'ను ప్రదర్శించింది. కానీ దీని కంటే ముందు సేమ్ ఫీచర్స్‌తో యాపిల్ కంపెనీ 'యాంటీ-స్టాకింగ్' ఫీచర్‌ను లాంఛ్ చేసేసింది.