తెలంగాణ

telangana

ETV Bharat / technology

గూగుల్ మ్యాప్స్​లో ఇంట్రెస్టింగ్ ఫీచర్- మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీని తెలుసుకోండిలా! - AIR QUALITY INDEX

గూగుల్ మ్యాప్స్‌‌లో అడ్రస్ వెతుక్కోవడమే కాదు.. మీ చుట్టూ ఉండే గాలి నాణ్యతను కూడా చెక్ చేసుకోవచ్చు.. అదెలాగంటే?

Google Introduced New Feature
Google Introduced New Feature (Google)

By ETV Bharat Tech Team

Published : Nov 12, 2024, 3:55 PM IST

Updated : Nov 12, 2024, 4:33 PM IST

Air Quality Index:సాధారణంగాఏదైనాకొత్త ప్రదేశానికి వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్స్​ యాప్​ను ఉపయోగిస్తుంటాం. అయితే ఇది మనకు సరైన రూట్​ను చూపించడమే కాకుండా మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను కూడా చెప్పేస్తుందట. అవునండీ బాబూ.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఇది గూగుల్ మ్యాప్స్​ యాప్​లో రియల్​ టైమ్ యావరేజ్ ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్ (AQI)ని చెక్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంటే ఇకపై ఏదైనా ప్రాంతంలో వాతావరణం, గాలి నాణ్యత వివరాలను దీని ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్​ ప్రకారం.. ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్ ప్రతి గంటకు అప్​డేట్ అవుతుంది. దీంతో ఇండియాలోని ఏ ప్రదేశంలోనైనా ఎయిర్ క్వాలిటీ గురించి తెలుసుకోవచ్చు. ఈ వారం నుంచి 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. గూగుల్ మ్యాప్​ AQI-రిలేటెడ్ సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే ఫార్మెట్​లో అందిస్తుంది. ఇది 0 నుంచి 500 వరకు స్పెసిఫిక్ ఏరియాలో కాలుష్య కారకాల ఆధారంగా గాలి నాణ్యతపై అంచనా వేసి సమాచారాన్ని అందిస్తుంది.

గూగుల్ మ్యాప్స్ ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్ వివరాలు ఇలా:

  • 0 to 50 is Fine
  • 51 to 100 is Satisfactory
  • 101 to 200 Medium
  • 201 to 300 is Poor
  • 301 to 400 is Very Poor
  • 401 to 500 Very Poor

గూగుల్ డిఫరెంట్ కలర్స్​ను ఉపయోగించి మ్యాప్​లోని గాలి నాణ్యతపై సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు గ్రీన్​ కలర్​ను గుడ్​ అని చెప్పేందుకు ఉపయోగిస్తే, రెడ్ కలర్​ను వెరీ పూర్ అని చెప్పేందుకు ఉపయోగిస్తుంది.

వాతావరణం, గాలి నాణ్యత మెరుగ్గా లేనప్పుడు గూగుల్ మ్యాప్ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఇనాక్టివ్, వృద్ధులు ఇంట్లోనే ఉండాలని సూచిస్తుంది. ఒకవేళ మీరు ఎయిర్ క్వాలిటీ సరిగా లేని ప్రదేశంలో నివసిస్తుంటే ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించాలని సిఫార్స్ చేస్తుంది. అంతేకాక అందుకోసం సరైనదాన్ని ఎంచుకోవడంపై డిటెయిల్డ్​గా గైడన్స్ అందిస్తుంది.

దీన్ని ఉపయోగించడం ఎలా?:

  • మీ లొకేషన్ ఎయిర్​ క్వాలిటీ గురించి తెలుసుకునేందుకు మొదట గూగుల్మ్యాప్స్​ను ఓపెన్ చేయండి.
  • తర్వాత లేయెర్స్ ఐకాన్​పై క్లిక్​ చేసి ఎయిర్​ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇది మీ లొకేషన్ రియల్​ టైమ్ AQIని చూపిస్తుంది.
  • అంతేకాక మీరు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే పద్ధతిని ఉపయోగించి ఆ ప్రదేశంలోని ఎయిర్ క్వాలిటీని కూడా చెక్ చేయొచ్చు.

ఇస్రోతో జతకట్టిన ఐఐటీ మద్రాస్- 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' స్థాపనపై ఒప్పందం

'రోజుకి 1.35 కోట్ల ఫ్రాడ్ కాల్స్- బ్లాక్ చేయడంతో రూ. 2,500 కోట్ల ఆస్తి సేఫ్'

Last Updated : Nov 12, 2024, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details