Google Announces New Android XR:గూగుల్ తన కొత్త 'ఆండ్రాయిడ్ XR' ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది. ఇది సాధారణ సాధారణ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది కాదు. ఇది నెక్ట్స్ జనరేషన్ కంప్యూటింగ్ కోసం రూపొందించిన పూర్తిగా కొత్త ఓఎస్. దీన్ని AI, AR, VR హెడ్‌సెట్స్, స్మార్ట్ గ్లాసెస్ కోసం రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఇందులో గూగుల్ 'జెమినీ AI' పనిచేస్తుంది. ఇది XR డివైజ్‌లను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుంది. దీంతో దీని సామర్థ్యాలు ఈ డివైజ్‌లను మించి ఉంటాయి.
ఇది ఆడియో, వీడియోలను క్యాప్చర్ చేయగలదు. అలాగే క్రియేట్ చెయ్యగలదు. ఇలా ఇది హెడ్‌సెట్‌లు, గ్లాసెస్‌లను మరింత స్పష్టంగా ఉపయోగకరంగా చేస్తుంది. దీనిపై గూగుల్2013 నుంచి పనిచేస్తోంది. ఇంతకుముందు గూగుల్ గ్లాస్, కార్డ్‌బోర్డ్, డేడ్రీమ్‌తో అన్వేషించింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం శాంసంగ్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్ తయారీదారి సంస్థలతో కలిసి పని చేస్తోంది.
దీనిలో ఫీచర్లు:మ్యాప్స్, ఫొటోలు, OS, యూట్యూబ్ వంటి వెర్షన్లకు సపోర్ట్ చేసేందుకు 'Android XR'ను రూపొందిస్తున్నారు. ఇది క్రోమ్ న్యూ వెర్షన్లో మల్టీవిండో మల్టీటాస్కింగ్‌ను కూడా అనుమతిస్తుంది. ప్లే స్టోర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న మొబైల్, టాబ్లెట్ యాప్‌లకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకూలంగా ఉంటుంది.
ఈ 'ఆండ్రాయిడ్ XR' ఫస్ట్ డెవలపర్ ప్రివ్యూ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది ARCore, Jetpack Compose, Un, It, OpenXR వంటి టూల్స్‌కు సపోర్టు చేస్తుంది. డెవలపర్‌లు తమ యాప్‌లను వర్చువల్ ఎన్విరాన్మెంట్లో విజువలైజ్ చేయడానికి అనుమతించేందుకు 'Android XR' ఎమ్యులేటర్ కూడా ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇంటిగ్రేట్ అవుతుంది.
ఈ 'ఆండ్రాయిడ్ XR' ఓఎస్ కోసం యూట్యూబ్ సహా పలు పాపులర్ గూగుల్ యాప్స్‌ను గూగుల్ రీడిజైన్ చేస్తోంది. వినియోగదారులు వర్చువల్ స్క్రీన్‌లో యూట్యూబ్, గూగుల్ టీవీని చూడొచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వస్తున్న మరో ప్రధాన ఫీచర్ 3Dలో గూగుల్ ఫోటోస్ చూడడం. దీని ద్వారా విజన్ ప్రోలో ఫొటోలు, వీడియోలను 3Dలో చూడొచ్చు. అంతేకాక సర్కిల్ టూ సెర్చ్ నుంచి సమాచారాన్ని కనుగొనడం కూడా సాధ్యమవుతుంది. దీని సహాయంతో గూగుల్ మ్యాప్స్‌ను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చు.