Canva Dream Lab AI Image Generator: ప్రపంచంలోనే ఏకైక ఆల్ ఇన్ వన్ విజువల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్ కాన్వా కొత్త డ్రీమ్ ల్యాబ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇది ఏఐ ద్వారా టెక్ట్స్‌ను ఇమేజ్ రూపంలో మార్చేందుకు ఉపయోగపడుతుంది. కాన్వా.. Leonardo.Aiని కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత ఈ ఈ డ్రీమ్ ల్యాబ్ విజువల్ సూట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ ఈ సూట్లో మ్యాజిక్ రైట్, Polls and Quizzes, ఇంటరాక్టివ్ చార్ట్స్, AI- పవర్డ్ వైట్‌బోర్డ్ వంటి కొత్త టూల్స్‌ను జత చేసింది.
కాన్వా ఏఐ ఇమేజ్ జనరేటర్ డ్రీమ్ ల్యాబ్: కాన్వా.. మంగళవారం ఈ డ్రీమ్ ల్యాబ్‌ను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ టెక్స్ట్-టు-ఇమేజ్ జనరేటర్. ఇది టెక్ట్స్‌కు అనుగుణంగా ఫొటోస్, గ్రాఫిక్స్‌ను క్రియేట్ చేస్తుంది. దీన్ని Leonardo.AI ఫీనిక్స్ ఫౌండేషన్ మోడల్ ఆధారంగా క్రియేట్ చేశారు. కాన్వాలో ఇప్పటికే డిఫ్యూజన్ బేస్డ్ ఏఐ ఇమేజ్ను జనరేట్ చేసే సదుపాయం ఉంది. అయితే తాజాగా తీసుకొచ్చిన ఈ డ్రీమ్ ల్యాబ్ వినియోగదారులకు హై-క్వాలిటీ ఇమేజెన్ను రూపొందించేందుకు ఉపయోగపడుతుంది.
ఈ ఏఐ ఇమేజ్ జనరేటర్ డ్రీమ్ ల్యాబ్ టెక్ట్స్ ఆధారంగా 15 డిఫరెంట్ స్టైల్లో ఇమేజెస్‌ను రూపొందిచగలదు. ఈ స్ట్రైల్స్లో 3D రెండర్స్, ఇలస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. కాంటెక్స్ట్-అవేర్ ఏఐ మోడల్ మల్టీ సబ్జెక్ట్ ఇమేజెస్‌ను, అలాగే ఫొటోరియలిస్టిక్ పోర్ట్రెయిట్‌లను క్రియేట్ చేయగలదు.