BSNL Launches Two New Prepaid Plans:BSNL యూజర్లకు గుడ్‌న్యూస్. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. ప్రైవేటు కంపెనీలన్నీ టారీఫ్ ధరలను పెంచేసిన వేళ కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ గత కొన్ని నెలలుగా తక్కువ ధరతో సరికొత్త ప్లాన్లను లాంఛ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా రూ. 628, రూ. 215 ధరతో మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లతో యూజర్లకు డేటా అండ్ యాక్టివ్ వ్యాలిడిటీ, వాయిస్ కాలింగ్ ఫెసిలిటీతో పాటు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల బెనిఫిట్స్ ఇవే!:
BSNL రూ.628 ప్లాన్:BSNL రూ.628 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లకు 84 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 100 SMS, రోజూ 3GB డేటా లభిస్తాయి. అంతేకాక కంపెనీ ఈ ప్లాన్‌తో హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ అండ్ ఆస్ట్రోసెల్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా 'Lystn Podcast', 'Zing Music', 'Wow Entertainment'తో పాటు 'BSNL Tunes'ను కూడా పొందొచ్చు.
BSNL రూ.215 ప్లాన్:BSNL తీసుకొచ్చిన ఈ కొత్త రూ.215 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 2GB ఇంటర్నెట్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు డైలీ 100 SMSలు లభిస్తాయి. వీటితో పాటు ఈ ప్లాన్‌తో హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ అండ్ ఆస్ట్రోసెల్ ప్రయోజనాలను కూడా పొందొచ్చు. అంతేకాక ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నవారు కూడా 'Lystn Podcast', 'Zing Music', 'Wow Entertainment', 'BSNL Tunes'ను సద్వినియోగం చేసుకోవచ్చు.