BSNL Best Data Plans 2024 : 'బీఎస్ఎన్ఎల్' (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తమ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఇంటర్నెట్ అధికంగా వినియోగించే వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.288 తో రీఛార్జ్ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ తో 120 జీబీ డేటా లభిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ రీఛార్జ్ ప్లాన్ అన్ని సర్కిళ్లలో అందుబాటులో లేదు. త్వరలోనే ఈ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు 'బీఎస్ఎన్ఎల్' అధికారులు తెలిపారు. ఈ ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అందించే వివిధ ఇంటర్నెట్ ప్యాక్ వివరాలు మీ కోసం.
'బీఎస్ఎన్ఎల్' కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఏకైక టెలికాం ఆపరేటర్. ప్రస్తుతం దేశమంతా 5జీ యుగం నడుస్తుంటే ఈ టెలికాం ఆపరేటర్ ఇంకా పూర్తిస్థాయిలో 4జీ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే 'బీఎస్ఎన్ఎల్' 5జీ సేవలకు తీసుకొస్తాం అని కేంద్రం చెబుతున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అందుకే ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు గట్టిపోటీ ఇవ్వలేకపోతోంది. అయితే ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే 'బీఎస్ఎన్ఎల్' రీఛార్జ్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
'బీఎస్ఎన్ఎల్' కొత్త రీఛార్జ్ ప్యాక్
- రీఛార్జ్ ప్యాక్ ధర రూ.288
- ఈ ప్లాన్‌ను మీ ప్రస్తుత రీఛార్జ్‌కు అనుగుణంగానే చేయాలి.
- దీనికి 60 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2 జీబీ డేటా వస్తుంది.
- లిమిట్ ముగిసిన అనంతరం 40 కేబీపీస్ స్పీడ్‌తో డేటా వస్తుంది.
ప్రస్తుతం ఈ రీఛార్జ్ అన్ని సర్కిళ్లలో అందుబాటులో లేదు. ఎందుకంటే 'బీఎస్ఎన్ఎల్' తన 4జీ సేవలను పూర్తి స్థాయిలో దేశమంతా విస్తరించలేదు. కాబట్టి తన 4జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రదేశంలో ఈ సేవలు లభిస్తాయి. వీటితో పాటు మరి కొన్ని ప్రత్యేకమైన ఇంటర్నెట్ ప్యాకేజీల వివరాలు ఇవే.
'బీఎస్ఎన్ఎల్' రూ.251 రీఛార్జ్ ప్యాక్
- ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే రెండు నెలల వ్యాలిడిటీ ఉంటుంది.
- 70 జీబీ డేటా లభిస్తుంది.
- అదనంగా జింగ్ మ్యూజిక్ సర్వీస్‌ను కస్టమర్ ఎంజాయ్ చేయవచ్చు.