తెలంగాణ

telangana

ETV Bharat / technology

బైక్ లవర్స్​కు గుడ్​న్యూస్- మార్కెట్లోకి ఒకేసారి నాలుగు కొత్త మోటార్‌సైకిల్స్ - BRIXTON MOTORCYCLES INDIA

నాలుగు బ్రిక్స్‌టన్ మోటార్​సైకిల్స్ లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..!

Brixton Motorcycles India
Brixton Motorcycles India (Brixton Motorcycles)

By ETV Bharat Tech Team

Published : Nov 19, 2024, 7:24 PM IST

Brixton Motorcycles India:బైక్ లవర్స్​కు గుడ్​న్యూస్. మార్కెట్లోకి నాలుగు సరికొత్త బైక్స్​ వచ్చాయి. ఆస్ట్రియాకు చెందిన బైక్స్ తయారీ సంస్థ బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిల్స్ తన నాలుగు కొత్త బైక్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

నాలుగు కొత్త బైక్స్ ఇవే:

  • క్రాస్‌ఫైర్ 500 ఎక్స్
  • క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సి
  • క్రోమ్‌వెల్ 1200
  • క్రోమ్‌వెల్ 1200 ఎక్స్‌

సమాచారం ప్రకారం..క్రాస్‌ఫైర్, క్రోమ్‌వెల్ మోడల్స్​ డెలివరీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇతర బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఇండియాలో రిలీజ్​ అయిన ఈ నాలుగు మోడల్స్​ నియో-రెట్రో డిజైన్​తో వస్తున్నాయి. వీటిలో 'క్రాస్‌ఫైర్ 500X' ఒక కేఫ్ రేసర్ బైక్. ఇక 'క్రోమ్‌వెల్ 1200' రోడ్‌స్టర్ బైక్.

Brixton Crossfire 500X (Brixton Motorcycles)

క్రాస్‌ఫైర్ 500X, క్రాస్‌ఫైర్ 500XC ఫీచర్లు:

  • ఈ బైక్స్ 486cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ టూ-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇంజిన్ 45 bhp పవర్, 43 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500X, క్రాస్‌ఫైర్ 500XC గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు.
Brixton Crossfire 500XC (Brixton Motorcycles)
  • క్రాస్‌ఫైర్ 500X ఒక కేఫ్ రేసర్. అయితే క్రాస్‌ఫైర్ 500XC ఒక స్క్రాంబ్లర్ బైక్. క్రాస్‌ఫైర్ 500X ముందు భాగంలో USD ఫోర్కులు, వెనుకవైపు సింగిల్ షాక్ అబ్జార్బర్‌తో కూడిన స్వింగ్‌ఆర్మ్‌ను అమర్చారు. మరోవైపు 500XC, లాంగ్-ట్రావెల్ USD ఫోర్క్‌లను ముందువైపు అడ్జస్టబుల్ ప్రీలోడ్‌తో, వెనుకవైపు రీబౌండ్ డంపింగ్‌తో అడ్జస్టబుల్ సింగిల్ షాక్‌ను కలిగి ఉంది.

క్రోమ్‌వెల్ 1200, క్రోమ్‌వెల్ 1200X ఫీచర్లు:

  • ఈ రెండు మోటార్‌సైకిళ్లు 1222cc, లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్​తో వస్తున్నాయి. ఈ ఇంజిన్ 80 బిహెచ్‌పి పవర్, 108 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లు 6-స్పీడ్ గేర్‌బాక్స్​తో వస్తున్నాయి. ఈ మోటార్‌సైకిళ్ల గరిష్ట వేగం గంటకు 198 కిలోమీటర్లు.
Brixton Cromwell 1200 (Brixton Motorcycles)
  • క్రోమ్‌వెల్ 1200, క్రోమ్‌వెల్ 1200X బైక్స్​ ముందువైపు KYB టెలిస్కోపిక్ ఫోర్క్‌లు ఉన్నాయి. క్రోమ్‌వెల్ 1200 వెనక భాగంలో KYB అడ్జస్టబుల్ ప్రీలోడ్ షాక్ అబ్జార్బర్‌ను కలిగి ఉంది. అయితే క్రోమ్‌వెల్ 1200X డబుల్ స్ట్రట్ KYBతో వస్తుంది.

ధరలు:

Brixton Cromwell 1200X (Brixton Motorcycles)

క్రాస్‌ఫైర్ 500 ఎక్స్ ధర: రూ. 4.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)

క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సి ధర: రూ. 5.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)

క్రోమ్‌వెల్ 1200 ధర:రూ. 7.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)

క్రోమ్‌వెల్ 1200 ఎక్స్‌ ధర: రూ. 9.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)

జీమెయిల్​లో సరికొత్త ఫీచర్!- స్పామ్​ మెయిల్స్ బెడద ఇక తప్పినట్లే!

ఇండియాకు చెందిన శాటిలైట్​ని ప్రయోగించిన స్పేస్​ఎక్స్​- ఇస్రో ఎందుకు లాంచ్ చేయలేదు? రీజన్ ఇదే!

ABOUT THE AUTHOR

...view details