Best Tips to Take Perfect Selfie:ఒక ప్రాంతంలోసెల్ఫీ దిగుతున్నారంటే.. అక్కడ చక్కటి బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. అయితే.. చాలా మంది కేవలం బ్యాక్ గ్రౌండ్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కానీ.. బ్రైట్ నెస్కూ అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫొటో దిగేటప్పుడు సరిపడా వెలుతురు ఉందో లేదో తప్పకుండా పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. కాంతి ఎటువైపు ఉందో ముందుగా గమనించాలి. కెమెరాను నేరుగా కాంతి వైపు కాకుండా.. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో.. అంటే కాంతిపడే దిశలో ఫొటోలు తీయాలి. అప్పుడే ఫొటోలు చాలా స్పష్టంగా వస్తాయి. ఒకవేళ వెలుతురు ఎక్కువైనా పర్లేదు.. కాంట్రాస్ట్‌లో తగ్గించుకోవచ్చు. కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి.
పోర్ట్రెయిట్ మోడ్:ప్రస్తుతం చాలా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు పోర్ట్రెయిట్ మోడ్‌ను కలిగి ఉంటాయి. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసి.. ప్రొఫెషనల్‌గా కనిపించేలా ఫొటోను డెలివరీ చేస్తుంది. కాబట్టి సెల్ఫీ దిగేటప్పుడు మీ ఫోన్లో పోర్ట్రెయిట్ మోడ్ సెట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీ ఫోన్లో ఆ ఆప్షన్ లేకుంటే.. మీరు మీ ఫోటోలకు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ని యాడ్ చేసుకోవడానికి Google ఫొటోలను ఉపయోగించవచ్చు.
సెల్ఫీల వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో! తెలిస్తే మీరే షాక్ అవుతారు!
డిఫరెంట్ కెమెరా యాంగిల్:కొద్దిమంది ఎప్పుడు చూసినా.. ఒకే రకమైన యాంగిల్లో సెల్ఫీలు దిగుతుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైనటువంటివి కాకుండా అప్పుడప్పుడూ కొత్త యాంగిల్స్ ట్రై చేయండి. దీనివల్ల ఫొటోలలో చేంజ్ ఈజీగా తెలిసిపోతుంది. ఫొటో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది.
యూజ్ సెల్ఫీ స్టిక్:ప్రస్తుతం చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. మరికొద్దిమంది మాత్రం నార్మల్‌గానే సెల్ఫీలు దిగుతుంటారు. అయితే నార్మల్‌గా దిగిన ఫొటోల కంటే.. సెల్ఫీ స్టిక్ ద్వారా తీసుకున్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే నార్మల్‌గా సెల్ఫీ దిగితే అవి షేక్ అయ్యి బ్లర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ సారి సెల్ఫీ స్టిక్‌తో ట్రై చేసి తేడా మీరే గమనించండి.
టైమర్ సెట్ చేసుకోండి:పర్ఫెక్ట్ ఫోజ్ పెట్టి.. సెల్ఫీ కెమెరాలో క్యాప్చర్ బటన్ ప్రెస్ చేసేలోపు అది కొంచెం షేక్ అయ్యి ఫొటో బ్లర్‌గా రావడం వంటివి జరుగుతుంటాయి. అయితే.. ఆ టెన్షన్ లేకుండా మీ ఫోన్లో సెల్ఫీ కెమెరా టైమర్‌ను సెట్ చేయండి. అంటే 2సె, 3సె, 5సెకన్లు.. ఇలా టైమ్ సెట్ చేసుకుంటే ఆ లోపు మీరు పెట్టాలనుకున్న ఫోజ్ పెట్టి సెల్ఫీ దిగొచ్చు.
మంచి బ్యాక్ గ్రౌండ్:ఒక్కోసారి మీరు ఫోటోలో ఎంత బాగా ఫోజిచ్చినా.. మీరు నిల్చున్న బ్యాక్ గ్రౌండ్ మీ ఫోటో అందాన్ని చెడగొడుతుంది. కాబట్టి సహజంగా అందంగా ఉన్న బ్యాక్ గ్రౌండ్‌ను ఎంపిక చేసుకుంటే స్వీట్ అండ్ సింపుల్‌గా ఉంటుంది.