Best Smartwatches Under 5000 : నేటి యువతకు స్మార్ట్‌వాచ్‌లు అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యువతీ, యువకులకు మాత్రమే కాదు, పెద్దవాళ్లకు కూడా ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అతి తక్కువ ఖర్చుతో, హెల్త్ మోనిటరింగ్ చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయి.
వాస్తవానికి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంతో అందరూ విసిగిపోతున్నారు. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇలాంటి వారు తమ రోజువారీ పనులను, చేసే వ్యాయామాలను ట్రాక్ చేసుకోవడానికి స్మార్ట్‌వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా హార్ట్ రేట్, స్లీప్ ప్యాట్రన్స్, క్యాలరీ కౌంట్ సహా ఎన్నో ఆరోగ్య విషయాలను వీటి ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది హెవీ బడ్జెట్ పెట్టలేరు. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.5000 బడ్జెట్లో మంచి స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్న టాప్-6 స్మార్ట్‌వాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Huawei Watch Fit Smartwatch : డైలీ వర్క్అవుట్స్ చేసే వారికి ఈ 'హవాయి వాచ్ ఫిట్ స్మార్ట్‌వాచ్' అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనిలో వివిడ్ 1.64 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంది. టచ్‌స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిలో చాలా ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. 96 వర్క్అవుట్ మోడ్స్ ఉన్నాయి. ఇది సిలికాన్ బ్యాండ్‌తో వస్తుంది. స్లీక్ గ్రాఫైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. చూడడానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. మార్కెట్లో ఈ హవాయి వాచ్ ఫిట్ స్మార్ట్‌వాచ్ ధర సుమారుగా రూ.4,999 ఉంటుంది.
2. Noise ColorFit Ultra 3 : తక్కువ ధరలో మంచి స్మార్ట్ వాచ్ కొనాలని అనుకునేవారికి 'నోయిస్ కలర్‌ఫిట్ ఆల్ట్రా 3' మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 1.96 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంది. దీనిని సింగిల్-చిప్ బీటీ టెక్నాలజీతో చాలా సులువుగా పెయిర్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాక్టివిటీ ట్రాకర్, క్యాలరీ ట్రాకర్, ఆక్సీమీటర్ (SpO2) లాంటి బెస్ట్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది చాలా లైట్ వెయిట్‌తో, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మార్కెట్లో ఈ నోయిస్ కలర్‌ఫిట్ ఆల్ట్రా 3 స్మార్ట్ వాచ్ ధర సుమారుగా రూ.2,999 ఉంటుంది.
3. Fire-Boltt Quest Smartwatch :ఈ 'ఫైర్-బోల్ట్ క్వెస్ట్ స్మార్ట్‌వాచ్'లో 1.39 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీనిలో జీపీఎస్ ఫీచర్ కూడా ఉంది. కనుక మీరు కోరుకున్న చోటుకు ఈజీగా వెళ్లవచ్చు. లేదా మీరు ఎక్కడ ఉన్నారనేది మీ ఇంట్లో వాళ్లు సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు. బ్లూటూత్‌లో దీనిని కనెస్ట్ చేసుకుని కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు. ఇది రగ్గడ్ లుక్‌తో చూడడానికి చాలా బాగుంటుంది. దీనిలో 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. కనుక ఫిట్నెస్ గోల్స్ ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇది వాటర్, డస్ట్ ప్రొటక్షన్‌ను కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించి బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ రేట్లను ట్రాక్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1,899 ఉంటుంది. తక్కువ ధరలో మంచి స్మార్ట్‌వాచ్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.