Best Earbuds Under 1500 : ప్రస్తుత కాలంలో చాలా మంది వైర్ లెస్ ఇయర్ ఫోన్స్‌ను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ప్రముఖ కంపెనీలు అన్నీ ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తెస్తున్నాయి. వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మార్కెట్లో రూ.1,500 కన్నా తక్కువ ధరలో మంచి ఫీచర్లతో పాటు,స్టైలిష్ డిజైన్లతో అందుబాటులో ఉన్న టాప్-10 ఇయర్ బడ్స్ పై ఓ లుక్కేద్దాం.
truke BTG Ultra
ఈ మోడల్ ఇయర్ బడ్స్ 5.4 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తాయి. వీటిని పెట్టుకుని ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్లో మాట్లాడవచ్చు. అలాగే సాంగ్స్ కూడా వినొచ్చు. ఈ ఇయర్ బడ్స్‌కు 12 నెలల వారంటీ ఉంది. ధర రూ.798. అలాగే ట్రుక్ బీటీజీ అల్ట్రా బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.
ఫీచర్లు : 360 స్పెషియల్™ ఆడియో, 13ఎంఎం గ్రాఫీన్ డ్రైవర్స్, 60 గంటల ప్లేటైమ్, ప్యూర్ వాయిస్ ఈఎన్ సీ టెక్నాలజీ
Amazon Basics TWS AB-T01B
ఈ మోడల్ ఇయర్ బడ్స్ సంగీత ప్రియులకు బాగా నచ్చుతాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 గంటల ప్లే టైమ్‌ను ఇస్తాయి. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఇయర్ బడ్స్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే ఇవి స్వెట్ ఫ్రూఫ్‌గా ఉంటాయి. ఈ ఇయర్ బడ్స్ ధర రూ.999.
ఫీచర్లు : 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ, 10ఎంఎం డ్రైవర్స్, 80 గంటల ప్లే టైమ్
Mivi DuoPods i2
ఈ మోడల్ ఇయర్ బడ్స్ మంచి ఆడియో క్వాలిటీని అందిస్తాయి. 45 గంటల ప్లేటైమ్‌ను ఇస్తాయి. ఇందులో ఉన్న డ్యూయల్-టోన్ డిజైన్ మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. కాల్ మాట్లాడినప్పుడు కూడా ఆడియో క్లారిటీగా వినిపిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 999.
ఫీచర్లు : 13mm డ్రైవర్స్, టైప్ సీ ఛార్జర్
Boult Audio Z20
ఈ ఇయర్ బడ్స్ ధర రూ.999. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60 గంటల ప్లే టైమ్‌ను ఇస్తాయి. రెగ్యులర్ గా వాడేవారికి, ప్రయాణాలు చేసేవారికి ఈ ఇయర్ పాడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ ఇయర్ బడ్స్ ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది.
ఫీచర్లు : జెన్ క్వాడ్ మైక్ ఈఎన్సీ, రిచ్ బాస్ సిగ్నేచర్, 60 గంటల ప్లే టైమ్, సీ టైప్ ఛార్జర్