Best 5G Smartphones Under Rs10,000: మీరు మంచి 5G స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ లాంఛ్ అవుతుండటంతో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వర్రీ.. మీలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. మార్కెట్లో అదిరే ఫీచర్లతో ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది కూడా కేవలం రూ.10వేల లోపే ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ల వివరాలు మీకోసం.
1. Infinix Hot 50 5G:మార్కెట్లో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న 5G మొబైల్స్‌లో 'ఇన్ఫినిక్స్ హాట్ 50 5G' ఒకటి. దీనిలో ఫీచర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇది గరిష్టంగా 8GB వరకు LPDDR4X RAM, 128GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా దీని స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.
'ఇన్ఫినిక్స్ హాట్ 50 5G' ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.7-అంగుళాల HD+ LCD (1600x 720 పిక్సెల్స్)
- రిఫ్రెష్ రేట్: 120 Hz
- బ్యాటరీ: 5000 mAh
- ప్రాసెసర్:మీడియాటెక్ డైమెన్సిటీ 6300
- G57 MC2 GPU
- 18W ఫాస్ట్ ఛార్జింగ్
- ప్రైమరీ సెన్సార్: 48 MP Sony IMX582
- డ్యూయల్ LED ఫ్లాష్‌తో డెప్త్ సెన్సార్
- అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్: 8 MP
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా XOS 14.5పై రన్ అవుతుంది. 'వెట్ టు ది రెసిస్టెన్స్' ఫీచర్ సపోర్ట్‌తో ఇది డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.
2. Realme C63:తక్కువ ధరలో మంచి ఫీచర్లతో మొబైల్ తీసుకోవాలి అనుకునేవారికి రియల్మీ C63 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని ధర కూడా మార్కెట్లో రూ.10వేల లోపే ఉంటుంది.
- డిస్‌ప్లే: 6.67-అంగుళాల HD+ స్క్రీన్ (1604 x 720 పిక్సెల్స్)
- డైనమిక్ రిఫ్రెష్ రేట్: 120 Hz
- టచ్ శాంప్లింగ్ రేట్: 240 Hz
- పీక్ బ్రైట్నెస్: 625 నిట్స్
- ప్రాసెసర్:ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm
- బ్యాటరీ:5000mAh
- 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇది 8GB LPDDR4x RAM, 128GB వరకు 2.2 స్టోరేజ్ కలిగి ఉంది. ఇది రియల్మీ UI 5.0 పైన ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రన్ అవుతుంది. ఇది 2 సంవత్సరాల OS అప్‌డేట్లతో వస్తుంది.
3. Moto G35 5G: మార్కెట్లో ఇటీవలే క్రేజీ ఫీచర్లతో కేవలం రూ.10వేలకే ఈ స్మార్ట్ఫోన్లాంఛ్ అయింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హల్లో యూఐ స్కిన్‌తో రన్ అవుతుంది.
'Moto G35 5G' ఫీచర్లు:
- డిస్‌ప్లే:6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
- రిఫ్రెష్ రేటు:120Hz
- టచ్ సాంప్లింగ్ రేటు:240Hz
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
- బ్యాటరీ: 5,000mAh
- ప్రాసెసర్:క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3
- 20W వైర్డ్ ఛార్జింగ్
- డాల్బీ అట్మోస్-బ్యాక్డ్ స్టీరియో స్పీకర్‌లు
- IP52 రేటింగ్ లెదర్ ఫినిష్