తెలంగాణ

telangana

ETV Bharat / technology

యాపిల్ సంచలన నిర్ణయం- ఏఐ జనరేటెడ్ ఎర్రర్-ప్రోన్ ఫీచర్ తొలగింపు! - ERROR PRONE FEATURE SUSPEND

ఏఐ జనరేటెడ్ ఎర్రర్-ప్రోన్ ఫీచర్​ తొలగించిన యాపిల్!- కారణం ఏంటంటే?

Apple Logo
Apple Logo (Photo Credit- Getty Image)

By ETV Bharat Tech Team

Published : Jan 19, 2025, 12:53 PM IST

Error-Prone Feature Suspend: టెక్ దిగ్గజం యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన ఏఐ జనరేటెడ్ ఎర్రర్-ప్రోన్ ఫీచర్​ను తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కంపెనీ తదుపరి సాఫ్ట్​వేర్ iOS 18.3 అప్​డేట్ ఫుల్ స్వింగ్​లో ఉంది. ఈ టెస్ట్ వెర్షన్​లో భాగంగా యాపిల్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ ఐఫోన్ వినియోగదారులు, డెవలపర్ గ్రూపునకు మాత్రమే అందుబాటులో ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ టెస్ట్ వెర్షన్ అందరికీ అందుబాటులోకి రానుంది.

ఈ ఎర్రర్-ప్రోన్ ఫీచర్ కొంతమంది ఐఫోన్ యూజర్లకు ఫేక్ న్యూస్ అలెర్ట్ వార్నింగ్స్​ పంపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీటా అప్​డేట్​లో సమాచారాన్ని రూపొందించడంలో సమస్యను పరిష్కారించే ప్రయత్నంలో న్యూస్, ఎంటర్​టైన్మెంట్ కోసం ఈ AI- జనరేటెడ్ ఫీచర్‌ను నిలిపివేయాలని టెక్నాలజీ ఇన్ఫో నిర్ణయించింది. ఈ విషయాన్ని యాపిల్ అధికారికంగా వెల్లడించింది.

అయినప్పటికీ యాపిల్ ఐప్యాడ్, మ్యూక్ కంప్యూటర్​ల కోసం తీసుకొచ్చే ఇలాంటి సాఫ్ట్​వేర్ అప్​డేట్​లు కూడా టెస్టింగ్ దశలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలికమే అయినప్పటికీ ఐఫోన్, దాని ఇతర ఉత్పత్తులకు AIని తీసుకువచ్చేందుకు యాపిల్ ప్రయత్నాలను ఈ డిసేబుల్మెంట్ వెనక్కి నెట్టిందని చెప్పొచ్చు.

గత సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించడంతో యాపిల్ ఈ ప్రయత్నం ప్రారంభమైంది. కుపెర్టినో, కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ 'యాపిల్ ఇంటెలిజెన్స్' పేరుతో తీసుకువచ్చిన ఈ ఏఐ ఫీచర్లను కంప్యూటర్ చిప్‌తో అమర్చారు. 2023 నుంచి ప్రీమియం ఐఫోన్15 మోడల్‌లు కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఈ AI ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి.

సెర్చ్ రిజల్ట్స్​పై కొన్ని విచిత్రమైన AI- రూపొందించిన సమాధానాలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. దీంతో పాటు తప్పుడు సమాచారాన్ని కూడా విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. గతేడాది ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ కొత్త వెర్షన్‌ను సమీక్షించాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా యాపిల్ భారత్​లో తన సేల్స్​ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా దేశంలోని తన యూజర్ల కోసం అదిరే యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ సర్వీసులు, కంపెనీ ప్రొడక్ట్​లు కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది చాలా యూజ్​ఫుల్​గా ఉంటుంది. అంటే దీని ద్వారా కంపెనీ హోమ్‌ డెలివరీతో పాటు పలు సర్వీసులను అందించనుంది. ఈ మేరకు యాపిల్​ స్టోర్​లో ఇప్పటికే ఈ యాప్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మస్క్ స్పేస్​ఎక్స్ ప్రయోగం విఫలం- లాంఛైన కాసేపటికే పేలిపోయిన రాకెట్!- వీడియో వైరల్

దేశంలోనే అతిపెద్ద ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని- 100కి పైగా కొత్త వాహనాల ప్రదర్శనలు!

మార్కెట్లోకి కిర్రాక్ ఫీచర్లతో రియల్​మీ, రెడ్​మీ 5G స్మార్ట్​ఫోన్లు- వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్?

ABOUT THE AUTHOR

...view details