Airtel Partnership with Apple:భారతీ ఎయిర్‌టెల్ సోమవారం తన పోస్ట్‌పెయిడ్, హోమ్ వై-ఫై వినియోగదారుల కోసం అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌తో జతకట్టింది. దీంతో ఇకపై భారతదేశంలోని ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వినియోగదారులు 'యాపిల్ టీవీ+'ను యాక్సెస్ చేయగలరు.
ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ సోమవారం ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యూజర్లు ఇప్పుడు 'యాపిల్ టీవీ+' మొత్తం లైబ్రరీని వారి ప్లాన్‌లతో యాక్సెస్ చేయగలరని తెలిపింది. దీని ధర రూ. 999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది కాకుండా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు పరిమిత సమయం వరకు యాపిల్ మ్యూజిక్‌కు కూడా ఫ్రీ యాక్సెస్ పొందుతారు.
యాపిల్‌తో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం:ఈ కొత్త ప్రకటనతోభారత్లో 'యాపిల్ టీవీ ప్లస్' కంటెంట్‌కు యాక్సెస్ ఇచ్చిన మొట్టమొదటి టెలికాంకంపెనీగా ఎయిర్‌టెల్ అవతరించింది. ఇప్పుడు తమ వినియోగదారుల కోసం యాపిల్ టీవీ ప్లస్ కంటెంట్‌పై ప్రత్యేక హక్కులను కలిగి ఉందని ఎయిర్‌టెల్ తన పత్రికా ప్రకటనలో తెలిపింది.
రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌లను కలిగి ఉన్న అన్ని ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వినియోగదారులు యాపిల్ టీవీ ప్లస్ కంటెంట్‌ను చూడగలరు. అదే సమయంలో ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ యూజర్లు రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్‌లతో 6 నెలల పాటు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందగలరు.
యాపిల్ టీవీ ప్లస్ యాక్సెస్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఫస్ట్ ప్లాన్:ఎయిర్‌టెల్ వై-ఫై ప్లాన్‌లు రూ.999 నుంచి ప్రారంభమవుతాయి. ఇది 200Mbps వరకు వేగాన్ని అందిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి TV బెనిఫిట్స్ ఉండవు. అయితే ఇప్పుడు యాపిల్, ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో ఈ ప్లాన్‌తో వినియోగదారులు 'యాపిల్ TV+' ని యాక్సెస్ పొందుతారు. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ సహా 23 ఇతర OTT ప్లాన్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తుంది.