2025 Kawasaki Ninja ZX-4RR:ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కవాసకి ఇండియా తన 2025 కవాసకి నింజా ZX-4RRని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ బైక్‌ను పరిచయం చేసిన కవాసకి వెంటనే దీన్ని ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. మూడు సరికొత్త కలర్ ఆప్షన్స్‌లో కంపెనీ ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
ఇంజిన్: ఈ కొత్త 2024 కవాసకి నింజా ZX-4RR బైక్‌లో అదే పాత 399cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 14,500rpm వద్ద 77bhp శక్తిని, 13,000rpm వద్ద 39Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రామ్ ఎయిర్‌తో అయితే ఈ పవర్ 14,500rpm వద్ద 80bhpకి చేరుకుంటుంది. పీక్ టార్క్ కోసం ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
స్టైలింగ్: ఈ బైక్ స్టైలింగ్ పరిశీలిస్తే ఇది షార్ప్ ఫెయిరింగ్, ట్విన్-LED హెడ్‌లైట్స్, అప్స్వెప్ట్ టెయిల్‌తో అగ్రెసివ్ లుక్‌లో కన్పిస్తుంది. బాడీవర్క్ కింద హై-టెన్సిల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ ఉంటుంది. దీని సస్పెన్షన్‌ను USD ఫోర్క్, బ్యాక్-లింక్ మోనోషాక్ ద్వారా రూపొందిచారు.
ఇతర ఫీచర్లు: ఈ బైక్‌లో 17-అంగుళాల చక్రాలు అమర్చారు. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 290 మిమీ డ్యూయల్ డిస్క్ బ్రేక్, వెనక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు అందించారు. ఈ కొత్త 2024 కవాసకి నింజా ZX-4RR మోటార్‌సైకిల్ బరువు 189 కిలోలు, గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ ఉంటుంది.
రైడ్ మోడ్స్:ఈ మోటార్‌సైకిల్‌లో నాలుగు రైడ్ మోడ్స్ ఉన్నాయి.
- స్పోర్ట్
- రోడ్
- రెయిన్
- కస్టమ్