BSNL Launches Free Intranet TV: BSNL వినియోగదారులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన యూజర్ల కోసం మొబైల్‌లో ఇంటర్నెట్ టీవీని ప్రారంభించింది. 'BiTV' పేరుతో ఈ కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చింది. కంపెనీ ఈ ప్రాజెక్ట్ ద్వారా వినియోగదారులకు దాదాపు 300 టీవీ ఛానెల్‌లు, సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాక ఈ కొత్త సర్వీస్ ద్వారా కస్టమర్లు ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా హై- క్వాలిటీతో కంటెంట్‌ను వీక్షించొచ్చు.
ఈ కొత్త సర్వీస్ ప్రయోజనాలు ఏంటి?: BSNL తీసుకొచ్చి ఈ కొత్త 'BiTV' సర్వీసుతో వినియోగదారులు ఎటువంటి రుసుము చెల్లించకుండా అన్లిమిటెడ్ OTT కంటెంట్‌ను చూడొచ్చు. యూజర్లు లైవ్ టీవీతో పాటు వివిధ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలనూ ఉచితంగా వీక్షించొచ్చు. ఈ సర్వీస్ కోసం BSNL సెక్యూర్ ఇంట్రానెట్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది అద్భుతమైన వీడియో క్వాలిటీని అందిస్తుంది. ఈ కొత్త సర్వీస్ కోసం BSNL.. 'OTTplay Premium'తో జత కట్టింది. ఇది 37 ప్రీమియం OTT ప్లాట్‌ఫారమ్స్, 500+ లైవ్ టీవీ ఛానెల్‌ల నుంచి కంటెంట్‌ను అందించే OTT అగ్రిగేటర్.
అందుబాటులోకి ఎప్పుడు?: ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పుదుచ్చేరిలో ప్రారంభించారు. వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్‌లో తీసుకురానున్నారు. త్వరలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని రిలీజ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త సర్వీస్‌పై BSNL CMD రాబర్ట్ రవి మాట్లాడారు. 'BiTV' ద్వారా ప్రతీ వినియోగదారుడు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఈ ఫ్రీ సర్వీసులను ఉపయోగించుకునేలా కంపెనీ వీలు కల్పిస్తుందని చెప్పారు.
మరోవైపు BSNL ఇటీవలే అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా IFTV పుదుచ్చేరిలో ప్రారంభించింది. ఇది కూడా ఫ్రీ సర్వేసే. ఇందులో 500 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు కంపెనీ FTTH (ఫైబర్-టు-ది-హోమ్) నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్నాయి. BSNL FTTH కస్టమర్లు ఈ సేవను ఫ్రీగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు తమకు ఈ సర్వీస్ కావాలని కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఫ్రీ సర్వీస్‌ను యాక్టివేట్ చేస్తారు.
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?- మరికొన్ని రోజుల్లో వాటిలో వాట్సాప్ బంద్!
స్మార్ట్‌ఫీచర్లతో కొత్త హోండా యాక్టివా- దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే కొనకుండా ఉండలేరుగా..!
అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. డివైజ్‌ల వాడకంపై పరిమితి!