2025 Triumph Speed Twin 900 Launched: బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. మార్కెట్లోకి సరికొత్త మోటార్‌సైకిల్ వచ్చింది. ప్రముఖ టూ-వీలర్ బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్ ఇండియా తన అప్డేటెడ్ 'ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900' బైక్‌ను లాంఛ్ చేసింది. కంపెనీ ఈ బైక్ డిజైన్‌ను మార్చి అదిరే లుక్‌లో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త బైక్ 3 కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. దీనిలో ప్రోమినెంట్ అండ్ హార్ట్ వేర్ మార్పులు చేసింది. అయితే ఈ బైక్ పవర్ ట్రెయిన్లో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు.
డిజైన్: దీని పాత మోడల్‌తో పోలిస్తే.. ఈ కొత్త బైక్ డిజైన్‌లో చాలా మార్పులు చేశారు. ఇది ఇప్పుడు ఎక్కువగా బ్లాక్డ్- అవుట్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. దీంతోపాటు మరింత మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ స్పీడ్ 'ట్విన్ 1200' బైక్‌ని పోలి ఉంటుంది. ఇక దీని 2025 అప్‌డేట్ విషయానికి వస్తే.. ఇది ట్రయంఫ్- బ్రాండెడ్ (J.Juan మేడ్) నాన్-అడ్జస్టబుల్ Marzocchi USD ఫ్రంట్ ఫోర్క్‌తో వస్తుంది.
సీటు ఎత్తు: ఈ కొత్త 'ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900' సీట్ ఎత్తు ఇప్పుడు 780 మిమీ (765 మిమీ నుంచి) వరకూ పెరిగింది. కావాలంటే సీటు ఎత్తును 760 మిమీ వరకు తగ్గించుకోవచ్చు. ఈ బైక్ నుంచి పాత సింగిల్-పాడ్ డిజి-అనలాగ్ డిస్‌ప్లేను తొలగించారు. ఇప్పుడు ఇది 'స్పీడ్ ట్విన్ 1200' మోడల్‌ను పోలిన TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది.
దీని స్విచ్ గేర్‌ను కూడా పెద్ద స్పీడ్ ట్విన్ మోడల్ నుంచి తీసుకున్నారు. ఈ బైక్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్స్ సూట్ గురించి మాట్లాడితే.. ఇందులో రోడ్ అండ్ రైన్ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో పాటు కార్నరింగ్ ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది.
పవర్‌ట్రెయిన్: ఈ మోటార్ సైకిల్ అదే 900cc లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 65bhp పవర్, 80Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది ఇప్పుడు లేటెస్ట్ యూరో 5+ నిబంధనలకు అనుగుణంగా ఉంది.
డెలివరీలు ఎప్పటినుంచి?: కంపెనీ ఈ కొత్త బైక్ డెలివరీలను జనవరి 2025 నుంచి ప్రారంభించొచ్చు.
ధర: కంపెనీ ఈ మోటార్ సైకిల్‌ను రూ.8.89 లక్షల (ఎక్స్-షోరూమ్, దిల్లీ) ధరతో ప్రారంభించింది. ఈ ధర దీని పాత మోడల్ కంటే రూ. 40,000 ఎక్కువ.
BSNL కొత్త ఇంటర్నెట్ టీవీ సర్వీస్ లాంఛ్- ఇకపై ఉచితంగానే హై క్వాలిటీ ఓటీటీ కంటెంట్!
రూ.50వేల బడ్జెట్లోని బెస్ట్ ల్యాప్‌టాప్స్ - వర్క్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా సరే!
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?- మరికొన్ని రోజుల్లో వాటిలో వాట్సాప్ బంద్!