2025 Jeep Meridian SUV Launched: దీపావళి పండగ వేళ మార్కెట్లోకి కొత్త కారు వచ్చింది. జీప్ ఇండియా తన అప్డేటెడ్ 2025 జీప్ మెరిడియన్ SUVని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ 3- వరుసల జీప్ మెరిడియన్ SUV మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చింది. మార్కెట్లో దీని బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఐదు వేరియంట్స్‌లో ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్‌లలో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఫీచర్లు:ఇందులో లెవెల్ 2 ADAS సూట్‌తో పాటు మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లను న్యూ టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ కారు 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో 10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను కలిగి ఉంది.
వీటితో పాటు ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ లాంగిట్యూడ్ వేరియంట్ ఐదు-సీట్ల వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, మిగతా అన్ని వేరియంట్‌లు ఏడు సీట్లతో వస్తున్నాయి. ఇందులో బేస్ వేరియంట్‌లో పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి కొన్ని ఫీచర్లు ఉండవు.
వేరియంట్స్:
- లాంగిట్యూడ్
- లాంగిట్యూడ్ ప్లస్
- లిమిటెడ్ (O)
- ఓవర్‌ల్యాండ్