2025 Honda SP125 Launched:వాహన ప్రియులకు శుభవార్త. న్యూ ఇయర్ వేళ మార్కెట్లోకి సరికొత్త మోటార్ సైకిల్ ఎంట్రీ ఇచ్చింది. 'హోండా SP125' పేరుతో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దీన్ని తీసుకొచ్చింది. సరికొత్త డిజైన్, ఫ్రెష్ లుక్ బాడీ గ్రాఫిక్స్‌తో పాటు ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, ఛార్జింగ్ పోర్ట్ వంటి కొన్ని కనెక్టింగ్ ఫీచర్లతో వస్తుంది.
కలర్ ఆప్షన్స్:కంపెనీ దీన్ని మొత్తం ఐదు రంగుల్లో తీసుకొచ్చింది.
- పెరల్ ఇగ్నియస్ బ్లాక్
- మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్
- పెరల్ సిరెన్ బ్లూ
- ఇంపీరియల్ రెడ్ మెటాలిక్
- మాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్
ఈ హోండా కొత్త SP125.. LED హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌తో వస్తోంది. బైక్‌కు ఫ్రెష్ లుక్ ఇచ్చేందుకు బాడీ గ్రాఫిక్స్‌ను మార్చారు. కంపెనీ దీన్ని ఓబీడీ 2బి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొచ్చింది. దీనిలో మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ బైక్‌లో కొత్తగా బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యంతో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌తో పనిచేస్తుంది.
ఇది టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయంతో వస్తుంది. అదనంగా వాయిస్ అసిస్టెంట్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది. వీటితోపాటు మొబైల్ ఛార్జింగ్ కోసం USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా జోడించారు. ఈ కొత్త హోండా SP125బైక్‌లో మెరుగైన మైలేజీ కోసం ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఉంది.
ఇంజిన్:ఈ లేటెస్ట్ బైక్‌లో 124 ఈసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 10.7bhp పవర్‌ను, 10.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.